Pushpa 2 Sensational Decision: గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన స్టైలిష్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ మూవీ పుష్ప సినిమా ఎలాంటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ముఖ్యంగా బాలీవుడ్ ని ఈ సినిమా ఒక్క ఊపు ఊపింది అనే చెప్పాలి..అక్కడ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ సృష్టించింది..కేవలం మూడు కోట్ల రూపాయిల ఓపెనింగ్ వసూళ్లతో ప్రారంభమైన ఈ సినిమా..ఫుల్ రన్ లో 100 కోట్ల రూపాయిల నెట్ ని వసూలు చేసి బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపొయ్యేలా చేసింది..ఈ స్థాయి వసూలు అప్పట్లో KGF చాప్టర్ 1 కూడా వసూలు చెయ్యలేదు..KGF చాప్టర్ 1 సినిమా కేవలం 45 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను మాత్రమే అప్పట్లో దక్కించుకుంది..ఇక చాప్టర్ 2 ఏకంగా హిందీ లో 450 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన సంగతి మన అందరికి తెలిసిందే..120 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన బాహుబలి 1 , పార్ట్ 2 మాత్రం ఏకంగా 515 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది..బాలీవుడ్ లో ప్రస్తుతం ఇదే ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది..ఈ లెక్కన పుష్ప 2 కూడా అదే స్థాయి వసూళ్లను కొల్లగొడుతుంది అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

Also Read: Rajamouli New Experiment On Mahesh: మహేష్ పై రాజమౌళి సరికొత్త ప్రయోగం.. వర్కౌట్ అవుతుందా?
వాస్తవానికి పుష్ప సినిమా హిందీలో ఈ స్థాయిలో విజయం సాధిస్తుంది అని ఆ చిత్ర దర్శక నిర్మాతలు అసలు ఊహించలేదు..అందుకే ఈ సినిమా హిందీ రైట్స్ ని చాలా తక్కువ మొత్తానికి అమ్మారు..యూట్యూబ్ లో హిందీ దబ్ మూవీ ని అప్లోడ్ చేసే గోల్డ్ మైన్ ఛానల్ ఓనర్స్ ఈ సినిమా ద్వారానే తొలిసారి థియేట్రికల్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు..తొలి సినిమాతోనే వారికి జాక్పాట్ కొట్టినట్టు అయ్యింది..20 కోట్ల రూపాయలకు హిందీ థియేట్రికల్ హక్కులను సంపాదించి ఏకంగా 100 కోట్ల రూపాయిల లాభాలను అర్జించాడు..అందుకే ఈసారి హిందీ లో వచ్చే లాభాలన్నీ స్వయంగా అనుభవించాలని పుష్ప మేకర్స్ భావిస్తున్నారట..బాలీవుడ్ లో తమకి ఉన్న సర్కిల్ ని ఉపయోగించుకొని పుష్ప పార్ట్ 2 సినిమాని కమిషన్ బేసిస్ మీద విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారట..అంటే థియేటర్ నుండి వచ్చే డబ్బులలో 60 శాతం కి పైగా నిర్మాతకి పోతుంది అన్నమాట..పుష్ప 2 కి ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ చూస్తుంటే కచ్చితంగా బాహుబలి 2 రేంజ్ లో హిందీ వసూళ్లు ఉంటాయని అర్థం అవుతుంది..అంటే ఈ సినిమా అక్కడ 600 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేస్తే ఇందులో 300 కోట్లకు పైగా నిర్మాత కి వెళ్తుందని తెలుస్తుంది..KGF చాప్టర్ 2 కి నిర్మాతలు అలాగే చేసారు..ఇప్పుడు పుష్ప 2 విషయం లో కూడా అదే ఫాలో అవ్వబోతున్నారట.
[…] Also Read: Pushpa 2 Sensational Decision: పుష్ప 2 హిందీ విషయం లో నిర్… […]
[…] Also Read: Pushpa 2 Sensational Decision: పుష్ప 2 హిందీ విషయం లో నిర్… […]