Homeఎంటర్టైన్మెంట్Sai Pallavi : ‘బలగం’ వేణుతో సాయిపల్లవి.. ‘ఎల్లమ్మ’గా లేడీ సూపర్ స్టార్.. కథ వింటే...

Sai Pallavi : ‘బలగం’ వేణుతో సాయిపల్లవి.. ‘ఎల్లమ్మ’గా లేడీ సూపర్ స్టార్.. కథ వింటే గూస్ బాంబ్సే !

Sai Pallavi : బలగం సినిమా సాధించిన విజయం అంతా ఇంతా కాదు. గ్రామీణ భావాలను తెరపైకి తెచ్చిన దర్శకుడు వేణు యెల్దండిని కొత్త స్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమాలోని నటులకు మరింత పేరు తెచ్చిపెట్టింది. ఇప్పటికీ గ్రామాల్లో దీన్ని ప్రదర్శించడం చూస్తే ఈ సినిమా ఎంత ప్రభావాన్ని చూపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి ‘బలగం’ సినిమాతో తెలంగాణ కల్చర్‌ను ప్రేక్షకులకు తెలిసేలా చేశాడు డైరెక్టర్ వేణు. ఇకపై తాను డైరెక్ట్ చేసే ఇతర సినిమాల్లో కూడా తెలంగాణ కల్చర్ ఉట్టిపడేలాగా చేస్తానని అప్పట్లోనే మాటిచ్చాడు వేణు. చెప్పినట్టుగానే తన తరువాతి సినిమాకు ‘ఎల్లమ్మ’ అనే టైటిల్ ఉంటుందని ప్రకటించాడు. ఈ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారనే విషయం పై చాలా కాలంగా ప్రేక్షకుల్లో కన్ఫ్యూజన్ ఏర్పడింది. నాని, నితిన్.. ఇలా పలువురు యంగ్ హీరోలు చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ముందుగా ఈ సినిమా నితిన్ దగ్గరకు వెళ్తే తను ఒప్పుకోలేదని, చివరికి తనే ఫైనల్ అయ్యాడన్న వార్తలు వినిపించాయి. మరి హీరో కూడా ఫైనల్ అవ్వడంతో అసలు ‘ఎల్లమ్మ’ మూవీ ఎక్కడ వరకు వచ్చిందనే విషయంపై క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ వేణు. ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనల్ డ్రాఫ్ట్ జరుగుతోందని తెలిపారు. కచ్చితంగా ప్రేక్షకులు అందరికీ ఇది నచ్చుతుందని హామీ ఇచ్చాడు. ఇందులో కూడా తెలంగాణ కల్చర్ ఉంటుంది. ఎమోషన్ ఉంటుంది. విలువలు ఉంటాయని చెప్పుకొచ్చాడు.

ఈ సినిమా కోసం సరైన హీరో దొరకక ఇన్నాళ్లు వెయిట్ చేశారు. ఇప్పుడు హీరో, హీరోయిన్.. ఇద్దరూ ఫిక్స్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ‘ఎల్లమ్మ’లో నితిన్‌కు జోడీగా హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి నటించనుందని తెలుస్తోంది. కథ నచ్చితే ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేయడంలో సాయి పల్లవి దిట్ట. ఈ విషయం ఇప్పటికే పలు సినిమాల్లో ప్రూవ్ కూడా అయింది. తాజాగా ఆమె అమరన్ సినిమాతో వెండితెర మీద కనిపించింది. ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించింది. ప్రస్తుతం దక్షిణాదిలో మోస్ట్ టాలెంటెడ్ క్రేజియస్ట్ హీరోయిన్ గా సాయి పల్లవికి పేరుంది. అమరన్ లో సాయి పల్లవి పెర్ఫార్మెన్స్ కి విమర్శకుల ప్రశంసలు లభించాయి. ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో ‘తండేల్’ మూవీ చేస్తోంది. అలాగే తమిళంలో కూడా ఒక ప్రాజెక్ట్ చేస్తుంది. అలాగే హిందీలో అమీర్ ఖాన్ కొడుకుతో ఒక సినిమా చేస్తోంది. అలాగే రణబీర్ తో కలిసి ‘రామాయాణం’లో సీతాదేవి పాత్రలో నటిస్తోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే సాయి పల్లవి చాలా సెలక్టివ్ గా కథలు ఎంచుకుంటుందనే సంగతి అందరికి తెలిసిందే.

సాయిపల్లవి కథ మొత్తం విన్న తర్వాత నచ్చితేనే మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. సాయి పల్లవి నితిన్ కి జోడీగా ‘ఎల్లమ్మ’ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దిల్ రాజు బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కనుంది. రీసెంట్ గా వేణు సాయి పల్లవిని కలిసి స్టోరీ చెప్పారట. అసలు కథ ఏంటంటే..‘‘ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా వేణు ఈ కథ రాసుకున్నాడట. ఎల్లమ్మ కోసం పోరాడిన దళిత యువకుడి కథే, ఎల్లమ్మ సినిమా అని సమాచారం. ఎల్లమ్మ హిందువుల ఆరాధ్య దైవం. కొన్ని ప్రాంతాల్లో ఆమెను ప్రత్యేకంగా పూజిస్తారు. జమదగ్ని భార్య అయిన రేణుక ఎల్లమ్మ భర్త ఆగ్రహానికి గురవుతుంది. దాంతో జమదగ్ని రేణుకా ఎల్లమ్మను శపిస్తాడు. ఎల్లమ్మ వికృత రూపంలో అడవుల్లో అష్టకష్టాలు పడుతుంది. ఓ ముని సూచన మేరకు పవిత్ర గంగా జలంలో మునిగి ఎల్లమ్మ శాప విముక్తురాలు అవుతుంది. తిరిగి భర్త జమదగ్ని ఆశ్రమానికి వెళుతుంది. ఆగ్రహించిన జమదగ్ని ఆమెకు ఆశ్రమ ప్రవేశం నిరాకరిస్తాడు. భర్త పాదాల వద్దే నా జీవితం అని ఎల్లమ్మ మొండికేస్తుంది . జమదగ్ని తన కొడుకులను పిలిచి తల్లి తల నరకాలని ఆదేశిస్తాడు. ఎవరూ ముందుకు రారు. పరశురాముడు మాత్రం తండ్రి ఆదేశం మేరకు తల్లిని సంహరిస్తాడు. పరశురాముడు నరికిన ఎల్లమ్మ తల వెళ్లి మాదిగలవాడలో పడుతుందట. అప్పటి నుండి మాదిగలు ఎల్లమ్మను దేవతగా కొలుస్తున్నారట. ఇతమిద్ధంగా ఎల్లమ్మ కథ ఇది.’’

ఈ మూవీ కథ, క్యారెక్టరైజేషన్ అంతా సాయి పల్లవికి బాగా కనెక్ట్ అయ్యిందని తెలుస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ కి వెంటనే ఆమె ఒకే చెప్పేసిందంట. త్వరలో ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ ప్రకటన రావొచ్చని అనుకుంటున్నారు. ప్రస్తుతం నితిన్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘రాబిన్ హుడ్’ చేస్తున్నాడు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular