Virupaksha Collections: ‘విరూపాక్ష’ 4 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. వర్కింగ్ డేస్ లో కూడా సునామి లాంటి వసూళ్లు!

Virupaksha Collections: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘విరూపాక్ష’ ఇటీవలే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకొని కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. విడుదలకు ముందే టీజర్ మరియు ట్రైలర్ తో ప్రేక్షకులను దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా విడుదల తర్వాత అంచనాలకు మించి సినిమా ఉండడం తో ఎవ్వరూ ఊహించని రేంజ్ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. 24 […]

Written By: Vicky, Updated On : April 25, 2023 3:33 pm
Follow us on

Virupaksha Collections: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘విరూపాక్ష’ ఇటీవలే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకొని కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. విడుదలకు ముందే టీజర్ మరియు ట్రైలర్ తో ప్రేక్షకులను దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా విడుదల తర్వాత అంచనాలకు మించి సినిమా ఉండడం తో ఎవ్వరూ ఊహించని రేంజ్ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.

24 కోట్ల రూపాయిల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో దిగిన ఈ చిత్రం,నిన్నటితో టార్గెట్ రీచ్ అయ్యి, నేటి నుండి లాభాల బాట పట్టనుంది. సమ్మర్ లో సరైన బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న ట్రేడ్ కి ఈ చిత్రం ఒక విందుభోజనం లాగ దొరికింది అనే చెప్పాలి.వీకెండ్స్ లో బాగా ఆడడం సర్వసాధారణం, కానీ వర్కింగ్ డేస్ లో కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ ని నమోదు చేస్తూ ముందుకు దూసుకెళ్తుంది అంటే ఈ సినిమా జనాలకు ఏ రేంజ్ లో రీచ్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం నాల్గవ రోజు అనగా వర్కింగ్ డే సుమారుగా 3 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది అట.ఈమధ్య వచ్చిన సినిమాలలో వర్కింగ్ డే ఇంత షేర్ రావడం ఈ చిత్రానికే జరిగింది. మార్నింగ్ షోస్ డీసెంట్ గా ప్రారంభం అయ్యి, మాట్నీస్ నుండి ప్రతీ చోట హౌస్ ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయి. నాలుగు రోజులకు కలిపి ప్రపంచవ్యాప్తంగా 24 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టిన ఈ చిత్రం.

ఇదే జోరు ని కొనసాగిస్తే ఫుల్ రన్ లో కచ్చితంగా 50 కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకుంటుంది అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలవడమే కాకుండా, ఆయన కెరీర్ లో మొట్టమొదటి 1 మిలియన్ చిత్రం గా కూడా నిల్చింది. సాయి ధరమ్ తేజ్ కం బ్యాక్ ఈ రేంజ్ లో ఉంటుందని బహుశా మెగా ఫ్యాన్స్ కూడా ఊహించి ఉండరు.