Sai Dharam Tej
Sai Dharam Tej: ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసిన బ్రో సినిమా హడావిడే కనిపిస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీ స్థాయిలో జరిగింది. సినిమా ప్రమోషన్ లో భాగంగా సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ తనకు యాక్సిడెంట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ చూపించిన ప్రేమ ఆప్యాయత గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు.
ఈ సినిమా కి ముందు ఒక యాక్సిడెంట్ అయ్యింది. దాదాపు 12 రోజులు నేను కోమాలో ఉన్నాను, ఆ సమయంలో ఉదయాన్నే షూటింగ్ కి వెళ్లే ముందు ప్రతి రోజు కళ్యాణ్ మామయ్య నా దగ్గరికి వచ్చి కూర్చొని, నా చెయ్యి పట్టుకొని ఒరేయ్ తేజ్ నీకేమి కాదు అంటూ ధైర్యం చెప్పేవాడు. ఆ మాటలు నాకు వినిపించేవి కానీ, నేను సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నాను. థాంక్యూ మామయ్య థాంక్యూ సో మచ్ లవ్ యు అని సాయిధరమ్ తేజ్ ఎమోషనల్ అయ్యారు.
అదే విధంగా నేను యాక్సిడెంట్ నుండి కోలుకున్న తర్వాత ఒక రోజు ఫోన్ చేసి, తేజ్ నువ్వు ఒక సినిమా చేయాలని అన్నారు. సరే మామయ్య అని ఒప్పుకున్నా తర్వాత ఈ సినిమాలో నువ్వు లీడ్ రోల్, నేను సపోర్టింగ్ రోల్ చేస్తున్న అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఆ తర్వాత నేను ఈ సినిమా చేయను అని చెప్పాను. ఎందుకంటే నేను ఆయన ఫ్యాన్ ని, అందుకే వద్దని చెప్పాను, కానీ మామయ్య వినకుండా వెంటనే వచ్చి కలవమని చెప్పాడు.
నేను వెళ్లిన తర్వాత ఫోన్ లో చెప్పిన విషయమే చెప్పి, నన్ను కన్విన్స్ చేశారు . నిజానికి ఈ సినిమా ఎప్పుడో ఫిక్స్ అయ్యింది, కానీ నాకు యాక్సిడెంట్ కావడంతో ఆ విషయం నాకు చెప్పలేదు. ఈ సినిమా ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది. కళ్యాణ్ మావయ్య నుంచి ఫ్యాన్స్ ఏమి కోరుకుంటారో అన్ని ఈ సినిమాలో ఉన్నాయి. అభిమానులందరూ చాలా గర్వంగా కాలర్ ఎగరేసుకుని తొడగొట్టి ముందుకు వెళుతూ ఉంటారు. అదైతే ప్రామిస్ చేసి చెప్పగలను. అంటూ చెప్పుకొచ్చాడు హీరో సాయి ధరమ్ తేజ్.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కి ట్రయిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.