Sai Dharam Tej: చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ మేనల్లుడిగా ఇండస్ట్రీ లోకి ‘రేయ్’ అనే సినిమా ద్వారా అడుగుపెట్టిన సాయి ధరమ్ తేజ్, ఆ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా టాలెంట్ ఉండడం తో నటన పరంగా మంచి పేరు దక్కించుకున్నాడు. ఆ తర్వాత పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫార్ సేల్, సుప్రీమ్, చిత్ర లహరి, ప్రతీ రోజు పండగే, రీసెంట్ గా విరూపాక్ష ఇలా ఎన్నో సూపర్ హిట్స్ తో ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు.
ఒకానొక దశలో ఆయనకి వరుసగా 6 డిజాస్టర్ ఫ్లాప్స్ కొట్టి కెరీర్ ని రిస్క్ లో పడేసుకున్నాడు. ఆ సమయం లో ‘చిత్రలహరి’ అనే చిత్రం నుండి సాయి ధరమ్ తేజ్ స్క్రిప్ట్ సెలక్షన్ లో మార్పులు వచ్చాయి. రిపబ్లిక్ సినిమా విడుదల సమయం లో యాక్సిడెంట్ కి గురైన సాయి ధరమ్ తేజ్, ఇప్పుడు మళ్ళీ కోలుకొని వరుసగా సినిమాలు చెయ్యడం ప్రారంభించాడు.
రీ ఎంట్రీ తర్వాత విరూపాక్ష చిత్రం తో గ్రాండ్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న సాయి ధరమ్ తేజ్, ఇప్పుడు తన మామయ్య తో కలిసి ‘బ్రో ది అవతార్’ చిత్రం లో నటించాడు. ఈ సినిమా ఈ నెల 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవ్వబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి ప్రొమోషన్స్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు సాయి ధరమ్ తేజ్.
రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ మీ తదుపరి చిత్రం ఏమిటి అని అడగగా , దానికి సాయి ధరమ్ తేజ్ సమాధానం చెప్తూ ‘ ప్రస్తుతం నేను సత్య అనే షార్ట్ ఫిలిం చేశాను,దీనికి నవీన్ అనే వ్యక్తి దర్శకుడు, అతి త్వరలోనే విడుదల కాబోతుంది. దీని తర్వాత సీతరా ఎంటర్టైన్మెంట్స్ లో ఒక సినిమా చేయబోతున్నాను. ఈ సినిమా చేసే మజుండు కాస్త బ్రేక్ తీసుకోవాలి అనుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు సాయి ధరమ్ తేజ్.