https://oktelugu.com/

Allu Arjun: పవన్ డైరెక్టర్ తో బన్నీ ప్లానింగ్.. సెట్ ఐతే షాకే !

Allu Arjun: మ్యాటర్ ఉండి కూడా సరైన సక్సెస్ రాకపోతే కలిగే బాధ, ఎదిగే అవకాశం ఉండి కూడా సరిగ్గా ఎదగలేకపోతే రగిలే ఆవేదన.. రెండు మాటల్లో చెప్పుకునేది కాదు. ఆ బాధ ఆవేదన రెండూ దర్శకుడు సాగర్ కె.చంద్రలో నిత్యం పోటీ పడుతూ ఉంటాయి. ‘భీమ్లా నాయక్’ సినిమాతో భారీ హిట్ కొట్టి, తన చిరకాల కోరిక తీర్చుకుని స్టార్ డైరెక్టర్ల లిస్ట్ లో సగర్వంగా తన పేరును చూసుకోవాలని సాగర్ కె.చంద్ర ఎంతో ఆశ […]

Written By:
  • Shiva
  • , Updated On : April 30, 2022 / 03:00 PM IST
    Follow us on

    Allu Arjun: మ్యాటర్ ఉండి కూడా సరైన సక్సెస్ రాకపోతే కలిగే బాధ, ఎదిగే అవకాశం ఉండి కూడా సరిగ్గా ఎదగలేకపోతే రగిలే ఆవేదన.. రెండు మాటల్లో చెప్పుకునేది కాదు. ఆ బాధ ఆవేదన రెండూ దర్శకుడు సాగర్ కె.చంద్రలో నిత్యం పోటీ పడుతూ ఉంటాయి. ‘భీమ్లా నాయక్’ సినిమాతో భారీ హిట్ కొట్టి, తన చిరకాల కోరిక తీర్చుకుని స్టార్ డైరెక్టర్ల లిస్ట్ లో సగర్వంగా తన పేరును చూసుకోవాలని సాగర్ కె.చంద్ర ఎంతో ఆశ పడ్డాడు.

    Allu Arjun

    కానీ ‘భీమ్లా నాయక్’ సినిమా సాగర్ కె.చంద్ర స్థాయిని పెంచలేదు. దాంతో ఆయన తన తర్వాత ఏం చేయాలి అనే క్వశ్చన్ దగ్గరే ఎంతో మధనపడి మొత్తానికి హీరో రవితేజతో ఒక సినిమాని సెట్ చేసుకునే ప్లాన్ లో ఉన్నాడు. మరో ఐదు నెలల్లో ఈ సినిమా పూర్తవుతుంది. మరి ఆ తరువాత ఏ సినిమా చేయాలి ? అప్పుడు కూడా చిన్నాచితకా హీరోలతోనే సినిమాలు చేస్తే ఇక ఇన్నేళ్ల తన సినీ ప్రయాణానికి అర్ధం ఏముంటుంది ?

    Also Read: Bheemla Nayak Nizam Record: నైజాం ప్రాంతం లో చెక్కు చెదరని భీమ్లా నాయక్ రికార్డ్

    ఇలాంటి ప్రశ్నలతో సాగర్ కె.చంద్ర ప్రస్తుతం సతమతమవుతున్నాడు. వాస్తవానికి సాగర్ కె.చంద్ర ప్రస్తుతం చేస్తున్న సినిమాని బన్నీతో చేయాల్సి వుంది, దిల్ రాజు బ్యానర్ లో బన్నీ హీరోగా ఈ సినిమా అనుకున్నారు. ఎప్పుడైతే ‘భీమ్లా నాయక్’ సినిమా కారణంగా సాగర్ కి ఎలాంటి ఇమేజ్ రాలేదో.. ఇక ఇప్పట్లో బన్నీతో సినిమా చేయడం సాధ్యం కాదు అని సాగర్ కి అర్ధమైంది.

    Allu Arjun

    దాంతో రవితేజతో సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడు. అయితే, తాజాగా బన్నీ నుంచి సాగర్ కి ఫోన్ వెళ్ళింది. ప్రస్తుతం తానూ చేస్తోన్న సినిమాలు పూర్తి అయ్యాక, కథ ఉంటే చెప్పండి, నచ్చితే సినిమా చేద్దాం అని బన్నీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

    కాకపోతే, కొత్తగా ఒప్పుకున్న సినిమాలు కూడా పూర్తి అవ్వడానికి మరో ఏడాది పడుతుందని.. ఈ లోపు ఫుల్ స్క్రిప్ట్ ఫినిష్ చేయండని బన్నీ అన్నాడట. బన్నీతో సినిమా అంటే ఏడాది అయినా వెయిట్ చేయొచ్చు అనే ఆలోచనలో వున్నాడు సాగర్. కాబట్టి వచ్చే ఏడాది వీరి కలయికలో ఓ సినిమా రానుంది.

    Also Read:Rajamouli Bad Sentiment: మెగా డిజాస్టర్‌ : రాజమౌళి బ్యాడ్‌ సెంటిమెంట్‌ నిజమైంది

    Recommended Videos:

    Tags