చిత్రం: సదా నిన్ను నడిపే
నటీనటులు: ప్రతీక్ ప్రేమ్ కరణ్, వైష్ణవి పట్వర్టన్, నాజర్, అలీ, రాజీవ్ కనకాల, రంగస్థలం మహేష్, జీవ , తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రతీక్ ప్రేమ్ కరణ్
నిర్మాతలు: ఆర్.పీ మూవీ మేకర్స్
సంగీతం: ప్రతీక్ ప్రేమ్ కరణ్, ప్రభు ప్రవీణ్
ఎడిటర్: ఎస్ఆర్ శేఖర్
డీవోపీ: ఎస్.డీ జాన్
sadha nannu nadipe telugu movie review : తెలుగు తెరపై సరికొత్త ప్రేమ కథలు సందడి చేస్తున్నాయి. ప్యాన్ ఇండియా స్థాయికి ఎదిగిన తెలుగు సినిమాలో ఈ స్వచ్ఛమైన ప్రేమకథలు అలరిస్తున్నాయి. తాజా కొత్త నటీనటులతో తెరకెక్కిన ‘సదా నిన్ను నడిపే’ చిత్రం ఈరోజు విడుదలై థియేటర్లలో సందడి చేస్తోంది. ‘ వానవిల్లు ‘ చిత్రం తర్వాత హీరో ప్రతీక్ ప్రేమ్ కరణ్ నటించిన చిత్రం ‘ ‘సదా నన్ను నడిపే ‘. వైష్ణవి పట్వర్ధన్ హీరోయిన్. నాగేంద్ర బాబు, నాజర్, రాజీవ్ కనకాల, ఆలీ ఇతర ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ఈ సినిమాకి చిత్ర హీరోనే దర్శకత్వం, స్క్రీన్‌ప్లే, సంగీతం అందించారు. స్వచ్చమైన ప్రేమ కథతో తెరకెక్కిన ఈచిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
Also Read: Corona Positive For Balakrishna: స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు కరోనా.. ఆందోళనలో ఫ్యాన్స్
కథ:
ఎంజే అలియాస్ మైఖేల్ జాక్సన్ (ప్రతీక్ ప్రేమ్ కరణ్) సరదాగా స్నేహితులతో గడిపే కుర్రాడు. అతడు సాహా(వైష్ణవి పట్వర్దన్) ప్రేమలో పడతాడు. ఆమె ఎంత కాదన్నా ఎంతో సిన్సియర్ గా ప్రేమిస్తూ ఉంటాడు. సాహా తండ్రి రాజీవ్ కనకాల కూడా ఎంజే ప్రేమని అంగీకరించడు. అయితే ఎంజే మాత్రం ఎలాగైనా సాహా ప్రేమని పొందాలని పరితపిస్తూ వుంటాడు. ఈ కార్యక్రమంలో ఎంజే ప్రేమని…. సాహా అంగీకరించి వివాహం చేసుకుంటుంది. అయితే పెళ్ళైన మొదటి రోజు నుంచే ఎంజేని దూరం పెడుతూ ఉంటుంది. పెళ్లి చేసుకుని కూడా సాహా… ఎంజేని ఎందుకు దూరం పెడుతూ ఉంటుంది? ఆమె సమస్య ఏంటి? హీరో దాన్ని ఎలా పరిష్కరించాడు? వీరిద్దరూ చివరకి కలుసుకున్నారా? లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే…!!!
విశ్లేషణ:
చిత్ర హీరో చెప్పినట్టు ఇంతకు మునుపు స్వచ్చమైన, నిశ్వర్థమైన ప్రేమకథలతో గీతాంజలి, కలిసుందాం రా లాంటి సినిమాలు వచ్చి బాక్సాఫీస్ ని కళకళ లాడించాయి. ఇప్పుడీ చిత్రాన్ని కుడా హీరో కమ్ డైరెక్టర్ ప్రతీక్ ప్రేమ్ కరణ్… ఎంతో ఎమోషనల్ గా… ప్యూర్ లవ్ ట్రాక్ తో ఎంతో ఎంటర్టైనింగ్ గా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. మనకు బాగా తెలిసిన వ్యక్తి చనిపోతున్నారని తెలిశాక వారితో వున్న కొద్దిక్షణాలను ఎంత మధుర జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటామో అనేది ఇందులో చూపించారు. ప్రేమించిన వ్యక్తికోసం ఎలాంటి త్యాగాన్ని ఆయినా చెయ్యొచ్చు అని… ఇందులో ఎంతో ఎమోషనల్ గా తెరకెక్కించారు. దానికీ ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. కర్నాటకలో జరిగిన ఓ వాస్తవ సంఘటన అంశాన్ని తీసుకుని సినిమాటిక్‌గా మార్చిన తీరు బాగుంది. ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా వుంది
-సినిమా ఎలా ఉందంటే?
హీరో కమ్ డైరెక్టర్ ప్రతీక్ ప్రేమ్ చాలా బాగా చేశాడు. తను నటిస్తూనే.. దర్శకత్వ బాధ్యలను చాలా సమర్థవంతంగా నిర్వహించాడు. హీరోయిన్ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. అలీ వున్నంత సేపు బాగా నవ్వులు పుయించాడు. నాగబాబు, రాజీవ్ కనకాల తమ తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. సంగీతం బాగుంది. నందు కంపోజ్ చేసిన ఫైట్స్ బాగున్నాయి. విజయవాడ, హైదరాబాద్, కొడైకెనాల్, కులుమనాలిలో చిత్రీకరించిన లోకేషన్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. ఎడిటింగ్ ఇంకాస్త ట్రిం చేసుంటే బాగుండేది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. మొత్తంగా చూడాల్సిన సినిమాగా చెప్పొచ్చు.
రేటింగ్: 3/5