Sachin’s son : ప్రపంచం లో ఎవ్వరు సాధించనటువంటి రికార్డ్ లను సాధించిన ఏకైక ప్లేయర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar)… ఆయన బ్యాటింగ్ ను చూసి ఇన్స్పైర్ అయ్యి క్రికెటర్ గా మారిన వారు సైతం చాలామంది ఉన్నారు. సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్ అయినా ఎబి డివిలియర్స్ (AB Diviliyars) సైతం సచిన్ టెండుల్కర్ కి వీరాభిమాని అనే విషయం మనందరికి తెలిసిందే. అలాంటి సచిన్ టెండూల్కర్ కొడుకు అయిన అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar)మాత్రం తన ఆటతో మంచి పేరును సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికి, ఎప్పటికప్పుడు ఫెలవమైన పర్ఫామెన్స్ ఇస్తున్నాడు. ఇక కారణం ఏదైనా కూడా ఇతర ప్లేయర్లు ఆట మీద దృష్టిని కేంద్రీకరించినట్టుగా ఆయన ఆడలేకపోతున్నాడు. తన తోటి ప్లేయర్లందరు ఐపిఎల్ లో రాణిస్తూ డొమెస్టిక్ క్రికెట్లో తమ సత్తా చాటుకుంటూ ఇంటర్నేషనల్ టీం లోకి సెలెక్ట్ అవుతుంటే ఆయన మాత్రం సరైన పర్ఫామెన్స్ ని ఇవ్వలేక డొమెస్టిక్ క్రికెట్ లోనే చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. ఇక రీసెంట్ గా ఆయన ఒక మాల్ దగ్గర నిలబడి ఉన్నప్పటికి అతన్ని ఎవ్వరు పట్టించుకోవడం లేదు. ఎంత సచిన్ టెండూల్కర్ కొడుకు అయినప్పటికి మనకంటూ స్వతహాగా టాలెంట్ ఉన్నప్పుడే మనల్ని ఎవరైనా గుర్తిస్తారు అంటూ సోషల్ మీడియాలో అతని మీద కొన్ని కామెంట్లు అయితే వ్యక్తం అవుతున్నాయి.
Also Read : సచిన్ కొడుకు అయితే ఏంటి.. కొమ్ములు ఉంటాయా?
మరి ఏది ఏమైనా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కొడుకు ఇంటర్నేషనల్ టీమ్ కి సెలెక్ట్ అవ్వకపోవడం నిజంగా చాలా దురదృష్టకరమైన విషయమనే చెప్పాలి. ఇక ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ టీం తరపున ఆడుతున్నప్పటికి తుదిజట్టులో అతనికి అవకాశం అయితే లభించడం లేదు. ఏదో ఒక మ్యాచ్ లో అవకాశం వచ్చినప్పటికి ఆయన తనను తాను ప్రూవ్ చేసుకోకపోవడంతో టీమ్ లోకి తీసుకోవడం లేదు.
మొత్తానికైతే తన తోటి ప్లేయర్లతో పోటీపడి ఆయన క్రికెట్ ని ఆడ లేకపోవడం సచిన్ టెండుల్కర్ కి భారీగా మైనస్ గా మారుతుంది. అతని పేరును చెడగొడుతున్నాడు అంటూ మరికొంతమంది కొన్ని కామెంట్లు అయితే చేస్తున్నారు.
ఏది ఏమైనా కూడా టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదు సచిన్ టెండూల్కర్ కొడుకు అయినంత మాత్రాన సచిన్ టెండూల్కర్ అవ్వాల్సిన పనిలేదు. అలాగే ఒక అనమకుడి కొడుకు అయినా కూడా టాలెంట్ ఉంటే పైకి ఎదుగుతారు. ఇక్కడ ఎవరి కొడుకు అనేది ఇంపార్టెంట్ కాదు టాలెంట్ ఉందా లేదా అనేది మాత్రమే ముఖ్యమని చాలామంది క్రికెట్ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.