కరోనా వల్ల దేశం అల్లకల్లోలం అయినప్పటి నుండి విలన్ సోనూ సూద్ కాస్త హీరో అయిపోయాడు. అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ లాక్ డౌన్ సమయంలో ఎంతో మంది వలస కూలీల దృష్టిలో దేవుడు అయ్యాడు. ఉపాధి కోల్పోయి తిండి లేక తిప్పలు పడుతున్న వారికి అన్నం పెట్టి, సమాజం దృష్టిలో రియల్ హీరో అనిపించుకున్నాడు. మరి ఇంత ఫాలోయింగ్ వచ్చాక, సోనూకి హీరోయిన్ లేకపోతే ఎలా ?
అందుకే, తాజాగా సోనూకి ఒక క్రేజీ హీరోయిన్ని పెట్టారు. దేనికి హీరోయిన్ అంటే.. సోనూ సరసన నటించడానికి. అదేంటి సోనూ హీరో ఎప్పుడు అయ్యాడు ?. రీసెంట్ గానే అయ్యాడు, ఒక ఆడియో కంపెనీ సోను సూద్ ని హీరోని చేసింది. హిందీలో గత కొన్ని ఏళ్లుగా పెద్ద హీరోలు, హీరోయిన్లతో ప్రైవేట్ సాంగ్స్ తీయడం ఒక ఫ్యాషన్ గా పెట్టుకుంది ఆ ఆడియో కంపెనీ. ఈ సాంగ్స్ కి బాగా గిట్టుబాటు అవుతుంది అట.
అందుకే, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోలు కూడా యూట్యూబ్ కోసం సాంగ్స్ లో నటించారు. ఇప్పుడు వారి లిస్ట్ లోనే సోను సూద్ కూడా చేరబోతున్నాడు. మరి ఎంతైనా సోనూ హీరోగా వస్తోన్న పాట అయ్యే ఇది. “సాత్ క్యా నిభావోగే” అంటూ సాగే ఈ పాటలో సోనూకి ఒక హీరోయిన్ కావాలి. చాలామందిని చూసి.. చివరకు బోల్డ్ బ్యూటీ ‘నిధి అగర్వాల్’ను ఫైనల్ చేశారు.
నిధి, సోనూ సరసన హీరోయిన్ గా నటించడం అంటే నిజంగా విశేషమే. ఎందుకంటే… నిధి అగర్వాల్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘హరి హర వీరమల్లు’ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. పవన్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తేనే ఎంతో గుర్తింపు వస్తోంది. అలాంటిది ఏకంగా హీరోయిన్ గా చేస్తోంది అంటే.. నిధికి కచ్చితంగా అది గొప్ప అవకాశమే. అయినా సోనూ పక్కన ఎందుకు ఒప్పుకుంది అంటే.. భారీ రెమ్యునరేషన్ కోసం.