సారా, రకుల్ అమాయకులు.. డ్రగ్స్ దందాలో లేరట..

బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్, టాలీవుడ్ అగ్ర హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లకు డ్రగ్స్ తో లింకు ఉందని రియా చక్రవర్తి చెప్పినట్టు రెండు మూడు రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. నెటిజన్స్ కొందరు సారా, రకుల్ పై తమదైన రీతిలో విమర్శలు కూడా చేశారు. జాతీయ చానెల్ అయిన టైమ్స్ నౌ ఛానల్ ముందుగా ఈ రియా కేసులో  బాలీవుడ్ తోపాటు సినీ ఇండస్ట్రీకి చెందిన దాదాపు 25 […]

Written By: NARESH, Updated On : September 15, 2020 11:57 am

Drug case tollywood

Follow us on

బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్, టాలీవుడ్ అగ్ర హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లకు డ్రగ్స్ తో లింకు ఉందని రియా చక్రవర్తి చెప్పినట్టు రెండు మూడు రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. నెటిజన్స్ కొందరు సారా, రకుల్ పై తమదైన రీతిలో విమర్శలు కూడా చేశారు. జాతీయ చానెల్ అయిన టైమ్స్ నౌ ఛానల్ ముందుగా ఈ రియా కేసులో  బాలీవుడ్ తోపాటు సినీ ఇండస్ట్రీకి చెందిన దాదాపు 25 పేర్లను రియా చక్రవర్తి వెల్లడించిందని వార్తను వైరల్ చేసింది. ఇది పెద్ద దుమారం రేపింది. రకుల్ పై అందరూ ఆడిపోసుకున్నారు. ఈ విషయం దుమారం రేపడంతో తాజాగా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్.సీ.బీ) స్పందించింది.

Also Read : హీరో కావాల్సిన లోకేష్ పొలిటీషన్ ఎలా అయ్యాడు?

ఈ ప్రచారంపై ఎన్.సి.బీ స్పష్టతనిచ్చింది. ఇవన్నీ వట్టి పుకార్లు అని క్లారిటీ ఇచ్చింది. ఎన్.సీ.బీ డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. ‘మాదక ద్రవ్యాల సరఫరా చేసే ముఠా వివరాలను సేకరించాం. బాలీవుడ్ ప్రముఖుల జాబితాను మేం సిద్ధం చేసుకోలేదు. కానీ అందరూ దాన్ని బాలీవుడ్ ప్రముఖుల లిస్ట్ గా అపార్థం చేసుకున్నారు’ అని అన్నారు. హీరోయిన్లు రకుల్, రియా పేర్లు ఉన్నట్లు వార్తలు వచ్చాయి కదా అని ప్రశ్నిస్తే.. అలాంటిది ఏమీ లేదని ఆయన సమాధానం ఇచ్చారు. డ్రగ్స్ వ్యవహారంలో అసలు రకుల్, సారా పేర్లను రియా చెప్పలేదని క్లారిటీ ఇచ్చాడు.

సుశాంత్ అనుమానాస్పద మృతి కేసులో డ్రగ్స్ కోణం బయటపడడంతో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్.సీ.బీ) రంగంలోకి దిగి రియా చక్రవర్తిని, ఆమె సోదరుడు సహా మరికొంతమందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.  ఈ క్రమంలోనే రియా 25మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లు చెప్పిందని వార్తలు బయటకొచ్చాయి.

డ్రగ్స్ వ్యవహారంతో సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు లేవని తెలియడంతో నెటిజన్లు, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ లకు క్షమాపణలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు పోస్ట్ చేసిన పోస్టులను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన సమంత ‘సారా, రకుల్ ’లకు సపోర్టుగా మాట్లాడింది. ఇలా నెటిజన్లు హీరోయిన్లపై అడ్డగోలుగా వ్యాఖ్యలు చేయవద్దని సూచించింది.

Also Read : బిగ్ బాస్ 4 : హౌస్ లో నోయల్ క్రష్ తనే…?