Thaman: ప్రస్తుతం టాలీవుడ్ లో దూసుకుపోతున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్. చిన్న పెద్ద అనే తేడా లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు తమన్. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరితో తమన్ పని చేశారు. మహేష్ బాబుతో సర్కారు వారి పాట, పవన్‌తో భీమ్లానాయక్, చిరంజీవితో గాడ్ ఫాదర్, రామ్ చరణ్- శంకర్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు తమన్. తాజాగా బాలకృష్ణ, బోయపాటి శ్రీను హ్యాట్రిక్ సినిమా ‘అఖండ’కు కూడా తమనే మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ముఖ్యంగా ఈ సినిమాలో తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అని బాలయ్య అభిమానులు తనను పొగడ్తలతో ముంచేస్తున్నారు.

తమన్ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటారు. అలానే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తూనే ఉంటారు. నెటిజన్లు మీమ్స్ ద్వారా ఆయన్ను ఎంతగా ట్రోల్ చేస్తారో… అంతే అభిమానిస్తారు. ఇతర సంగీత దర్శకులతో పోలిస్తే తమన్ పేరు ఎక్కువగా సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంటుందనడంలో సందేహం లేదు. అయితే ఇప్పుడు తమన్ రెమ్యునరేషన్ ఎంత అన్న సందేహం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. కాగా తమన్ ఒక్కొక్క సినిమాకు దాదాపు రెండున్నర నుండి మూడున్నర కోట్ల రెమ్యునరేషన్‌ను తీసుకుంటాడని టాక్ నడుస్తుంది. కాకపోతే మ్యూజిక్ డైరెక్టర్‌కు వచ్చే రెమ్యునరేషన్‌లో వారు సౌండ్ ఇంజనీర్లకు, మ్యూజిక్ ప్లేయర్స్‌కు, మిక్స్ ఇంజనీర్లకు కూడా తమ వాటా ఇవ్వాల్సి ఉంటుంది. అలా మొత్తంగా కలిపితే తమన్ రెమ్యునరేషన్ ఇంత భారీగా ఉంటుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు తమన్ చేతిలో దాదాపు 10కి పైగా సినిమాలు ఉన్నాయి. ఇలా వరుస సినిమాలను చేస్తూనే.. త్వరలో పట్టాలెక్కబోతున్న సినిమాలకు కూడా రెడీ అవుతున్నాడు తమన్.