Jabardasth Satya Sri: గ్లామర్ ఫీల్డ్ లో ఎఫైర్ రూమర్స్ చాలా సాధారణం. ఒక హీరో హీరోయిన్ కలిసి వరుసగా రెండు చిత్రాలు చేస్తే ఏదో ఉందని సంబంధం కట్టేస్తారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా నటులకు ఎఫైర్స్ అంటగట్టడం తరచుగా జరిగే వ్యవహారం. పెళ్లై పిల్లలున్న చమ్మక్ చంద్రకు ఓ లేడీ కమెడియన్ తో ఎఫైర్ ఉందంటూ అప్పట్లో విపరీతంగా ప్రచారం జరిగింది. ఆ లేడీ కమెడియన్ ఎవరో కాదు సత్యశ్రీ. అయితే ఈ ఎఫైర్ వార్తలపై ఓ ఇంటర్వ్యూలో సత్యశ్రీ ఓపెన్ అయ్యారు. జరిగిన నిజం ఏమిటో తెలియజేశారు.

సత్యశ్రీని జబర్దస్త్ కి పరిచయం చేశాడు చమ్మక్ చంద్ర. ఆయన మొగుడు పెళ్ళాల కామెడీ డ్రామాకు ఫేమస్. భార్యాభర్తల గొడవలు, గిల్లికజ్జాలే ప్రధానంగా చమ్మక్ చంద్ర స్కిట్స్ ఉండేవి. కాబట్టి భార్య రోల్ అనేది ఆయన స్కిట్స్ లో చాలా సాధారణం. చాలా కాలం వినోద్ లేడీ గెటప్ తో చమ్మక్ చంద్ర భార్యగా స్కిట్స్ చేశారు. లేడీ గెటప్స్ తో విసిగిపోయిన చమ్మక్ చంద్ర కమెడియన్ సత్యశ్రీని తన టీం లో చేర్చుకున్నారు. సత్యశ్రీతో చమ్మక్ చంద్ర కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. వారిద్దరి కామెడీ టైమింగ్ కూడా కుదిరింది. దీంతో పదుల సంఖ్యలో స్కిట్స్ చేశారు.
ఈ క్రమంలో వీరి మధ్య ఎఫైర్ ఉందంటూ కథనాలు పుట్టుకొచ్చాయి. సత్యశ్రీ-చమ్మక్ చంద్ర మధ్య సంథింగ్ సంథింగ్ అట, ఆ కారణంగానే ఆమెకు ఆఫర్స్ ఇస్తున్నారంటూ ప్రచారం జరిగింది. ఈ వార్తలపై సత్యశ్రీ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. చమ్మక్ చంద్రతో తనకు ఎఫైర్ ఉందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ఆయన నాకు గురువుతో సమానం. చమ్మక్ చంద్ర గారిని నేను ఆ దృష్టితోనే చూస్తాను. ఈ ప్రచారం ఇంటి సభ్యుల వరకూ వచ్చింది. పేరెంట్స్ నన్ను నిజం ఏమిటని కూడా అడిగారు. నేను వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాను, దాంతో వాళ్ళు రిలాక్స్ అయ్యారు.

తర్వాత పరిశ్రమలో ఇలాంటివి కామన్ నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళు అని ప్రోత్సహించారంటూ సత్యశ్రీ చెప్పుకొచ్చింది. ఈ టాపిక్ చమ్మక్ చంద్రతో అందరి ముందు కూడా డిస్కస్ చేశాము. నవ్వుకున్నాము అని ఆమె వెల్లడించారు. ఇక జబర్దస్త్ నుండి వెళ్లిపోవడానికి చమ్మక్ చంద్రనే కారణమని సత్యశ్రీ చెప్పారు. ఆయనే నన్ను జబర్దస్త్ కి తీసుకొచ్చారు. చమ్మక్ చంద్ర అక్కడి నుండి బయటికి రాగానే నేను మానేశాను. అంతకు మించి పెద్ద కారణం లేదని సత్యశ్రీ చెప్పుకొచ్చింది. జబర్దస్త్ వీడాక ఆమె పెద్దగా కనిపించడం లేదు.
[…] Also Read: Jabardasth Satya Sri: చమ్మక్ చంద్రతో ఎఫైర్ రూమర్స్… […]