https://oktelugu.com/

RRR సీత‌పై కొన‌సాగుతున్న‌ రూమర్లు..!

బాలీవుడ్ బ్యూటీ అలియాభ‌ట్ షెడ్యూల్ ఎంత టైట్ గా ఉందంటే.. క‌నీసం రెస్ట్ తీసుకోవ‌డానికి కూడా టైం దొర‌క‌నంత బిజీగా ఉంది. వ‌రుస‌గా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ..దూసుకెళ్తోందీ అమ్మ‌డు. ఇటు RRRలో సీత‌గా న‌టిస్తున్న అలియా.. అటు బాలీవుడ్లో రెండు సినిమాల‌తో బిజీగా ఉంది. ఇందులో బ్ర‌హ్మాస్త్ర రిలీజ్ కు సిద్ధ‌మ‌వుతుండ‌గా.. గంగూబాయి క‌తియావాడీ మూవీలో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోంది. ఈ మూడు చిత్రాల న‌డుమ డేట్స్ ప్లాన్ చేస్తూ.. అడ్జెస్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది. […]

Written By:
  • Rocky
  • , Updated On : March 20, 2021 / 12:22 PM IST
    Follow us on


    బాలీవుడ్ బ్యూటీ అలియాభ‌ట్ షెడ్యూల్ ఎంత టైట్ గా ఉందంటే.. క‌నీసం రెస్ట్ తీసుకోవ‌డానికి కూడా టైం దొర‌క‌నంత బిజీగా ఉంది. వ‌రుస‌గా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ..దూసుకెళ్తోందీ అమ్మ‌డు. ఇటు RRRలో సీత‌గా న‌టిస్తున్న అలియా.. అటు బాలీవుడ్లో రెండు సినిమాల‌తో బిజీగా ఉంది. ఇందులో బ్ర‌హ్మాస్త్ర రిలీజ్ కు సిద్ధ‌మ‌వుతుండ‌గా.. గంగూబాయి క‌తియావాడీ మూవీలో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోంది.

    ఈ మూడు చిత్రాల న‌డుమ డేట్స్ ప్లాన్ చేస్తూ.. అడ్జెస్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది. అయితే.. ఇప్పుడు విన‌ప‌డుతున్న రూమ‌ర్ ఏమంటే.. RRRలో సీత పాత్ర‌ను రాజ‌మౌళి పెంచార‌ట‌! దీనివ‌ల్ల మిగిలిన రెండు చిత్రాల‌కూ టైమ్ కేటాయించ‌లేపోతోంద‌ని అక్క‌డి మేక‌ర్స్ అంటున్నార‌ట‌. ఈ మేర‌కు వ‌ర‌స క‌థ‌నాలు ప్ర‌చురించిన ముంబై మీడియా.. దీనివ‌ల్ల అలియా ఇబ్బందులు ప‌డుతోంద‌ని కూడా రాసుకొచ్చింది.

    దీంతో.. అంద‌రి చూపూ జ‌క్క‌న్న‌పైనే ప‌డింది. అలియా పాత్ర ప‌రిధి పెంచింది నిజ‌మేనా.. అదే జ‌రిగితే RRR షూటింగ్ కూడా మ‌రింత డ్రాగ్ అవుతుందా? దీనికి రాజ‌మౌళి ఏం స‌మాధానం చెబుతారు? అని అంద‌రూ చూస్తున్నారు. అయితే.. రాజ‌మౌళి అధికారికంగా స్పందించ‌లేదు గానీ.. సోర్స్ ప్ర‌కారం ఇందులో వాస్త‌వం లేద‌ని తెలుస్తోంది.

    ఆల‌స్యం జ‌రిగిన మాట వాస్త‌వ‌మేగానీ.. అది RRR వ‌ల్ల కానే కాద‌ట‌. గంగూబాయీ క‌తివాడీ సినిమా షూట్లో ఉండ‌గానే ద‌ర్శ‌కుబు భ‌న్సాలీకి క‌రోనా అటాక్ అయ్యింది. దీంతో.. అనివార్యంగా అలియా క్వారంటైన్ లోకి వెళ్లింది. అది పూర్తి చేసుకున్న త‌ర్వాత టెస్ట్ చేయించుకోగా.. నెగెటివ్ వ‌చ్చింద‌ని కూడా ప్ర‌క‌టించింది. కాబ‌ట్టి.. అలియా డేట్స్ విష‌యంలో RRR నుంచి వ‌చ్చిన ఇబ్బంది ఏమీలేద‌ని తెలుస్తోంది. ఇక‌, రామ్ చ‌ర‌ణ్ – అలియా మ‌ధ్య ఓ పాట బ్యాలెన్స్ ఉన్న విష‌యం తెలిసిందే. అలియా ముంబై నుంచి రాగానే.. షూట్ చేసే ప‌నిలో ఉన్నారు జ‌క్క‌న్న‌.