Homeఎంటర్టైన్మెంట్Marakkar Movie: అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చిన "మరక్కార్" మూవీ టీమ్

Marakkar Movie: అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చిన “మరక్కార్” మూవీ టీమ్

Marakkar Movie: మోహన్‌లాల్…  హీరోగా నటించిన “మరక్కార్”  సినిమా రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ సినిమాలో గ్రాఫిక్స్ హైలెట్‌గా నిలుస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాలో మోహన్‌లాల్‌తో పాటు ఆయన తనయుడు ప్రణవ్ మోహన్‌లాల్ నటిస్తున్నారు. మరోవైపు యాక్షన్ కింగ్ అర్జున్, సునీల్ శెట్టి, ప్రభు, సిద్దిక్, కీర్తి సురేష్, మంజు వారియర్, కళ్యాణి ప్రియదర్శన్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను మోహన్‌లాల్ ప్రాణ మిత్రుడు, లెజెండరి డైరెక్టర్ ప్రియదర్శన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు ముందే 67వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ చిత్రంతో పాటు బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్‌, స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో అవార్డులు కొల్లగొట్టి సంచలనం రేపింది. 

rumors about mohan lal movie marakkar releasing on amazon prime

అయితే ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్లు, టీజర్, ట్రైలర్ లకు అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఐతే ఏడాదిన్నర కిందటే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. గత ఏడాది ఎన్ని ఓటీటీ ఆఫర్లు వచ్చినా చిత్ర బృందం టెంప్ట్ కాలేదు. ఇలాంటి భారీ చిత్రం వెండి తెరల్లో చూస్తేనే ప్రేక్షకులకు అందాల్సిన అనుభూతి అందుతుందన్న ఉద్దేశంతో సాధారణ పరిస్థితుల కోసం ఎదురు చూశారు.

ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడంతో పరిస్థితులు బాగుపడుతున్నాయనుకుంటున్న సమయంలో ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయబోతున్నారనే వార్తా సంచలనంగా మారింది. కేరళలో మళ్లీ థియేటర్లు పున:ప్రారంభమై… కొన్ని రోజుల్లోనే 100 శాతం ఆక్యుపెన్సీ వస్తుందనుకుంటున్న సమయంలో ‘మరక్కార్’ సినిమాను అమేజాన్ ప్రైమ్‌కు విక్రయించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

పరిస్థితులు మెరుగుపడుతున్నప్పటికీ… మళ్లీ వైరస్ ముప్పు ఉండొచ్చన్న సంకేతాల నేపథ్యంలో ప్రేక్షకులు సినిమాకు ఆశించిన రెవెన్యూ రాకపోవచ్చన్న భయంతో ఓటీటీ బాట పట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి విడుదల తేదీని కూడా ప్రకటించనున్నట్లు సమాచారం. మరి ఈ వార్త నిజమే అయితే మోహన్ లాల్ అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular