Rukmini Vasanth on Kantara 2: చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరోయిన్ రుక్మిణి వాసంత్(Rukmini Vasanth). ఈమె మన తెలుగు ఆడియన్స్ కి ‘సప్త సాగరాలు ఎల్లో – సైడ్ A/B’ సిరీస్ ద్వారా పరిచయమైంది. హార్డ్ హిట్టింగ్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఆ రెండు సినిమాల్లోని రుక్మిణి నటన ఆడియన్స్ చేత కన్నీళ్లు పెట్టించేలా చేసింది. ఈ చిత్రానికి ముందు 2019 వ సంవత్సరం లో బీర్బల్ త్రయాలజీ లో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత ‘అప్ స్టార్ట్స్’ అనే హిందీ చిత్రం లో కూడా నటించింది. ఈ రెండు సినిమాల తర్వాత బాగా గ్యాప్ తీసుకొని ‘సప్తసాగరాలు ఎల్లో’ సిరీస్ చేసింది. ఈ సినిమా తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. కన్నడ తో పాటు తెలుగు, తమిళం మరియు ఇతర భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా మారిపోయింది.
ఇకపోతే ఈ ఏడాది ఆమె నటించిన ‘కాంతారా 2’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో నటించిన తన అనుభవం గురించి రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది రుక్మిణి వాసంత్. ఆమె మాట్లాడుతూ ‘ఈ చిత్రం లో నేను విలన్ క్యారక్టర్ చేసి చాలా ప్రమాదకరమైన ప్రయోగమే చేసాను. సాధారణంగా ఏ హీరోయిన్ అయినా కెరీర్ ఆరంభం లో విలన్ క్యారెక్టర్స్ చేయడానికి భయపడతారు. నేను కూడా తొలుత ఈ క్యారెక్టర్ ఆఫర్ చేసినప్పుడు చాలా భయపడ్డాను. ఇప్పుడే కెరీర్ మొదలైంది, ఇలాంటి సమయం లో విలన్ క్యారక్టర్ చేసి, ఆడియన్స్ చేత ద్వేషం పొందితే నాకు కెరీర్ లేకుండా పోతుందేమో అని భయపడ్డాను. కానీ ఏదైతే అది అని ఈ విలన్ క్యారక్టర్ చేసేసాను’.
‘ఆడియన్స్ నన్ను ద్వేషిస్తారని అనుకున్నాను, కానీ నన్ను ఈ క్యారక్టర్ ద్వారా ఆదరించారు. సినిమా ఆరంభం నుండి నన్ను విలన్ అని ఎవ్వరూ ఊహించలేదు. ప్రీ క్లైమాక్స్ లో నేనే మెయిన్ విలన్ అనే తెలిసేలోపు అందరూ థ్రిల్ కి గురయ్యారు, అది బాగా కలిసొచ్చింది. భవిష్యత్తులో ఇంతకంటే పవర్ ఫుల్ విలన్ రోల్స్ చేయడానికి నాకు ఈ సినిమా ధైర్యాన్ని ఇచ్చింది’ అంటూ చెప్పుకొచ్చింది రుక్మిణి వాసంత్. ప్రస్తుతం ఈమె ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అదే విధంగా ఈమె రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో కూడా హీరోయిన్ గా ఎంపిక అయ్యినట్టు సమాచారం. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ హీరోయిన్ ఇంకా ఎంత దూరం వెళ్తుంది అనేది.