Rukmini Vasanth: ‘సప్తసాగరాల్లో ఎల్లో’ సిరీస్ ద్వారా సౌత్ ఇండియన్ ఆడియన్స్ కి పరిచయమైన హీరోయిన్ రుక్మిణి వాసంత్(Rukmini Vasanth). తొలి రెండు సినిమాలతోనే ఈమె మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ముఖ్యంగా యూత్ లో ఈమెకు ఉన్నటువంటి ఫాలోయింగ్ మామూలుది కాదు. ఈ చిత్రాల తర్వాత ఆమె గత ఏడాది శివ కార్తికేయన్ తో కలిసి ‘మదరాసి’ అనే చిత్రం చేసింది. ఆ తర్వాత రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ, హీరో గా నటించిన ‘కాంతారా 2’ లో విలన్ క్యారెక్టర్ లో కనిపించి ఆడియన్స్ ని సర్ప్రైజ్ కి గురి చేసింది. కెరీర్ ప్రారంభం సమయం లో ఏ హీరోయిన్ కూడా విలన్ క్యారెక్టర్స్ చేయడానికి రిస్క్ చేయరు. కానీ ఈమె ఏకంగా హీరో తో ఢీ విలన్ క్యారెక్టర్ చేసి మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం ఈమె చేతిలో ఉన్న సినిమాలన్నీ పాన్ ఇండియన్ సినిమాలే.
అందులో కన్నడ సూపర్ స్టార్ యాష్ నటించిన ‘టాక్సిక్’, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’, అదే విధంగా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతున్న రామ్ చరణ్, సుకుమార్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించేందుకు సంతకం చేసింది. రాబోయే రోజుల్లో ఈమె కెరీర్ పరంగా ఏ రేంజ్ కి వెళ్లబోతుంది అనేది మీకు అర్థం అయ్యే ఉంటుంది. అయితే రీసెంట్ గానే ఈమె సోషల్ మీడియా లో అప్లోడ్ చేసిన ఒక ఫోటో ఈమె అభిమానుల గుండెల్ని బద్దలు చేసింది. తన ప్రియుడితో కలిసి డిన్నర్ కి వెళ్లిన ఫోటోని అప్లోడ్ చేసింది. ఆమె ప్రియుడు సినీ ఇండస్ట్రీ కి చెందిన వాడు కాదు, తన ఫ్రెండ్ సర్కిల్ లో ఎప్పటి నుండో బాగా క్లోజ్ గా ఉన్న వ్యక్తితోనే ఆమె ప్రేమలో పడినట్టు తెలుస్తోంది. అతని పేరు, వివరాలు మాత్రం తెలియదు కానీ, కుర్రాడు చూసేందుకు మాత్రం చాకు లాగా ఉన్నాడని అంటున్నారు నెటిజెన్స్.
కెరీర్ ఇప్పుడిప్పుడే సెట్ అవుతోంది , ఆ కుర్రాడితో ప్రేమలో ఉండడం ఓకే, కానీ అప్పుడే పెళ్లి వద్దంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ రుక్మిణి వాసంత్ ని ట్యాగ్ చేసి చెప్తున్నారు. ఎందుకంటే హీరోయిన్స్ కి పెళ్లి తర్వాత సినీ కెరీర్ ఉండదు అనే భావన అందరిలోనూ ఉంది. తెలియకుండానే ఇండస్ట్రీ కి దూరం అయిపోతుంటారు. కెరీర్ లో స్థిరపడి పెద్ద రేంజ్ కి వెళ్లిన తర్వాత పెళ్లి గురించి ఆలోచించొచ్చు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే రుక్మిణి చేతిలో ఉన్న ప్రతీ సినిమా వెయ్యి కోట్ల రేంజ్ మార్కెట్ ఉన్నవే. అన్నీ కాకపోయినా, ఒక్క సినిమా హిట్ అయినా ఆమె జాతకం మారిపోతుంది అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.
Rukmini Vasanth is committed pic.twitter.com/FD4G905mbe
— Kolly Censor (@KollyCensor) January 17, 2026
