ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డు నెలకొల్పిన ‘ఎన్టీఆర్’ !

ఎన్టీఆర్ ‘కొమురం భీమ్’గా కేవలం కొన్ని సెకెన్ల షాట్ లోనే అద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్ తో పాటు అనితరసాధ్యమైన తన ఎమోషనల్ ఫెర్మామెన్స్ తో ఆకట్టుకున్నాడు. అందుకే అభిమానులతో పాటు యావత్తు సినీ లోకం అంతా ఈ టీజర్ ను పదే పదే చూసి మురిసిపోతుంది. దాంతో భీమ్ టీజర్ కి విపరీతమైన వ్యూస్ ఇంకా వస్తూనే ఉన్నాయి. దాంతో టాలీవుడ్‌లో ఈ టీజర్ సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. ‘రామరాజు ఫర్ భీమ్’ అంటూ […]

Written By: admin, Updated On : April 23, 2021 12:35 pm
Follow us on


ఎన్టీఆర్ ‘కొమురం భీమ్’గా కేవలం కొన్ని సెకెన్ల షాట్ లోనే అద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్ తో పాటు అనితరసాధ్యమైన తన ఎమోషనల్ ఫెర్మామెన్స్ తో ఆకట్టుకున్నాడు. అందుకే అభిమానులతో పాటు యావత్తు సినీ లోకం అంతా ఈ టీజర్ ను పదే పదే చూసి మురిసిపోతుంది. దాంతో భీమ్ టీజర్ కి విపరీతమైన వ్యూస్ ఇంకా వస్తూనే ఉన్నాయి. దాంతో టాలీవుడ్‌లో ఈ టీజర్ సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది.

‘రామరాజు ఫర్ భీమ్’ అంటూ వచ్చిన ఈ టీజర్ యూట్యూబ్ లో ఇప్పటివరకూ 50 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టి.. ఎన్టీఆర్ స్టార్ డమ్ ఏమిటో మరోసారి చూపించింది. పైగా టాలీవుడ్ ఇండస్ట్రీలో 50+ వ్యూస్ మార్క్ అందుకున్న మొట్ట మొదటి టీజర్‌ గా కూడా కొమురం భీమ్ టీజర్ నిలవడం విశేషం. అలాగే ఈ టీజర్ కు 1.3ం పైగా లైక్స్.. అలాగే 1.4ం కామెంట్స్ రావడం కూడా రికార్డే.

మొత్తానికి టీజర్ లో ఎన్టీఆర్ చిన్నపాటి నటనా విశ్వరూపానికే ఈ రేంజ్ సరికొత్త రికార్డ్స్ నమోదు అయినప్పుడు.. ఇక సినిమా రిలీజ్ అయ్యాక రెండు గంటల పాటు ఎన్టీఆర్ నటనను చూసి.. ప్రేక్షకులు ఇక ఎలాంటి రికార్డ్స్ ను నమోదు చేస్తారో. మొత్తానికి నేషనల్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో పరిపూర్ణ నట రత్న ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ కోసం దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

ఈ సినిమా నుండి ఇప్పటివరకూ రిలీజ్ అయిన ఇద్దరి హీరోల ఫస్ట్ లుక్ వీడియోలు ప్రేక్షకులందరికీ విపరీతంగా నచ్చేశాయి. విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా గొండు బెబ్బులి కొమరం భీంగా తారక్ అద్భుతంగా కనిపించడంతో సినిమా పై ఉన్న భారీ అంచనాలు రెండంతలు రెట్టింపు అయ్యాయి. దీనికితోడు ఈ టీజర్ తో తారక్ ఏ ఒక్క రికార్డును వదలకుండా వేటాడేసాడు. ఇంకా వ్యూస్ పరంగా కూడా సరికొత్త రికార్డ్ లను సెట్ చేశాడు.

తారక్ ఫ్యాన్స్ కు మాత్రం ఈ సరికొత్త రికార్డ్ సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. ఇద్దరు బడా స్టార్స్ ఒకే సినిమాలో కలిసి నటిస్తుండటంతో.. మొదటినుండి ఈ సినిమా పై ప్రత్యేక అభిమానాన్ని చూపిస్తున్నారు అభిమానులు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ క్రేజీ బ్యూటీ ఆలియా భట్, అలాగే ఎన్టీఆర్ కి జోడీగా హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ నటిస్తున్నారు.