RRR: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ మేనియా కనిపిస్తోంది. ఈ సినిమా విడుదలకు 20 రోజులు కూడా లేదు. జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, బాహుబలి సినిమా తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా రాజమమౌళి తెరకెక్కించిన సినిమా కావడంతో.. భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో రామ్‌చరణ్, తారక్ హీరోలుగా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్.. అన్ని భాషల్లో మిలియన్ల వ్యూస్‌తో దూసుకెళ్లిపోతోంది. కాగా, ఈ క్రమంలోనే విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్‌పై దూకుడు పెంచారు జక్కన్న. ఇందు కోసం చాలా భిన్నమైన పద్దతులను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది.
తాజాగా, తారక్, చరణ్, నిన్న సాయంత్రం ప్రో కబడ్డీ ప్రారంభ వేడుకలో జాతీయ, ప్రాంతీయ స్పోర్ట్స్ ఛానెల్స్‌లో సినిమాను ప్రమోట్ చేశారు. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఐపీఎల్ తర్వాత అంతటి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో దూసుకెళ్లిపోతున్న కబడ్డీ(పీకేఎల్) ఎనిమిదో సీజన్‌ను బుధవారం ఆర్ఆర్ఆర్ హీరోలతో పాటు దర్శకుడు రాజమౌళి ప్రారంభించారు.
పవర్ఫుల్ గేమ్‌కు ఇంతకంటే పదునైన ప్రారంభం ఏముంటుంది 🤩
𝐘𝐨𝐮𝐧𝐠𝐓𝐢𝐠𝐞𝐫 @tarak9999 🔥
𝐌𝐞𝐠𝐚𝐏𝐨𝐰𝐞𝐫𝐒𝐭𝐚𝐫 @AlwaysRamCharan 😍
𝐉𝐚𝐤𝐤𝐚𝐧𝐧𝐚 @ssrajamouli 🥳చూడండి#vivoProKabaddi#LePanga
మీ #StarSportsTelugu / StarMaaGold / Disney + Hotstar లో pic.twitter.com/uMxEeLbZvd— StarSportsTelugu (@StarSportsTel) December 22, 2021
పవర్ఫుల్ గేమ్‌కు ఇంతకంటే పదునైన ప్రారంభం ఏముంటుంది?.. అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియా వేదికగా స్టార్ స్పోర్ట్స్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియోలను నెట్టింట వైరల్‌గా మారాయి. స్వాతంత్య్ర సమరయోధులైన భీమ్, అల్లూరి సీతారామరాజుల పాత్రకు కల్పితాన్ని జోడించి ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో అజయ్‌దేవగణ్, శ్రియా, ఒలివియా మోరిస్, అలియాభట్, తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Rrr team promotions at pro kabaddi stage
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com