RRR In Japan: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రం ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై ఎంతతి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందో మన అందరికి తెలిసిందే..ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కాంబినేషన్ లో రాజమౌళి సినిమా అనగానే మన ఊహల్లో ఎలాంటి అంచనాలు ఉంటాయో..ఆ అంచనాలను మించి ఈ సినిమా అద్భుతాలను సృష్టించింది..విడుదలైన ప్రతి భాషలో కూడా కాసుల కనక వర్షం కురిపించి 1200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

థియేట్రికల్ పరంగా ఇంతతి సంచలన విజయం సాధించిన ఈ సినిమా..OTT విడుదల తర్వాత ఇతర దేశాలలో కూడా సెన్సషనల్ రెస్పాన్స్ ని దక్కించుకుంది..నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా కి హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ చెయ్యగా దానికి వంద మిలియన్ల వ్వాచ్ మినిట్స్ వచ్చాయి..ఈ స్థాయి రెస్పాన్స్ ఇప్పటి వరుకు నెట్ ఫ్లిక్స్ లో కేవలం హాలీవుడ్ సినిమాలకు మాత్రమే వచ్చాయి..కానీ ఒక ఇండియన్ సినిమాకి ఈ రేంజ్ రావడం ఇదే తొలిసారి..ఇప్పటికి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతూనే ఉండడం ఒక రేర్ రికార్డుగా చెప్పుకోవచ్చు.
గ్లోబల్ వైడ్ ఆ రేంజ్ రీచ్ రావడం తో ఈ సినిమాని చైనా, జపాన్ వంటి బాషలలో దబ్ చేసి విడుదల చేస్తున్నారు..రేపు జపాన్ లో ఈ సినిమా విడుదల కాబోతుండడం తో #RRR మూవీ టీం ప్రొమోషన్స్ కోసం జపాన్ కి వెళ్లారు..అక్కడ మీడియా తో బాగా ఇంటరాక్ట్ అయ్యారు..అయితే జపాన్ లో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కి విపరీతమైన క్రేజ్ ఉంది అనే సంగతి మన అందరికి తెలిసిందే..అయితే #RRR మూవీ ప్రొమోషన్స్ లో పాల్గొన్న వీరికి ఫాన్స్ తాకిడి గట్టిగానే ఉంది.

ముఖ్యంగా రామ్ చరణ్ కి ఎక్కడకి వెళ్లిన అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది..పక్కనే జూనియర్ ఎన్టీఆర్ ఉన్నా కూడా రామ్ చరణ్ తోనే సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు..దీనిని బట్టి చూస్తే ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ కి జపాన్ లో ఎక్కువ క్రేజ్ ఉంది అనే విషయం అర్థం అవుతుంది..మగధీర సినిమా జపాన్ లో ప్రభంజనం సృష్టించింది..ఈ సినిమా నుండే రామ్ చరణ్ కి అక్కడ విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.