https://oktelugu.com/

RRR Promotion: ఆర్ఆర్ఆర్ ప్రమోషన్: రాజమౌళి దేన్నీ వదలడం లేదే..!

RRR Promotion: దర్శకధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ ను అదిరిపోయే రేంజులో చేస్తున్నాడు. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో ‘ఆర్ఆర్ఆర్’కు క్రేజ్ వచ్చేలా ప్రమోషన్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో కలిసి రాజమౌళి తనదైన స్ట్రాటజీలతో సినిమాకు ఎక్కడలేని హైప్ ను తీసుకొస్తూ ముందుకు దూసుకెళుతుండటం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇందుకోసం రాజమౌళి తనకు కలిసి వచ్చిన అన్ని అవకాశాలను సద్వినియోగం […]

Written By:
  • NARESH
  • , Updated On : December 23, 2021 / 12:18 PM IST
    Follow us on

    RRR Promotion: దర్శకధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ ను అదిరిపోయే రేంజులో చేస్తున్నాడు. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో ‘ఆర్ఆర్ఆర్’కు క్రేజ్ వచ్చేలా ప్రమోషన్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో కలిసి రాజమౌళి తనదైన స్ట్రాటజీలతో సినిమాకు ఎక్కడలేని హైప్ ను తీసుకొస్తూ ముందుకు దూసుకెళుతుండటం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

    RRR Promotion

    ఇందుకోసం రాజమౌళి తనకు కలిసి వచ్చిన అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. తాజాగా ప్రోకబడ్డీ  లీగ్(పీకేఎల్) లోనూ రాజమౌళి ఇదే స్ట్రాటజీని వర్కౌట్ చేసి ‘ఆర్ఆర్ఆర్’కు కావాల్సిన ప్రమోషన్స్ ను చేసేశారు. మాగ్నమ్ ఓపస్ మూవీ ప్రమోషన్ లో భాగంగా రాజమౌళి ప్రొకబడ్డీ లీగ్ లో విభిన్నమైన ప్రచారాన్ని చేయడం ఆసక్తిని రేపుతోంది.

    జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ తో కలిసి ఈ వేదికలో పాల్గొన్న రాజమౌళి పనిలో పనిలో ‘ఆర్ఆర్ఆర్’కు కావాల్సిన ప్రచారాన్ని చేశారు. కబడ్డీ ఆటలో భాగంగా ముందుగా ఎన్టీఆర్ తనదైన శైలిలో ‘అమ్మ తోడు’ అంటూ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత రాంచరణ్ ‘ఈ ఆట నాదే- ఈ వేట నాదే’ అంటూ కూతకు వచ్చాడు.

    వీరి మధ్యలో చేరిన రాజమౌళి తాను స్టార్ట్ చెప్పకుండానే మొదలుపెట్టారా? అంటూ ప్రోకబడ్డీ లీగ్ లో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల నాటుసాంగుతో అలరించిన రాంచరణ్, ఎన్టీఆర్ ఇప్పుడు కబడ్డీ ఆటతో ఆకట్టుకున్నారు.

    మొత్తానికి ప్రోకడ్డీతో రాజమౌళి జాతీయ, ప్రాంతీయ ఛానళ్లలో ‘ఆర్ఆర్ఆర్’ కావాల్సినంత ప్రమోషన్ చేసి రాజమౌళి తన మార్క్ చూపించాడు. ఇక ఈ మూవీ జనవరి 7న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఇప్పటికే ఈమూవీకి సంబంధించిన టీజర్స్, ట్రైలర్స్, సాంగ్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

    Also Read: రాజమౌళి స్ట్రాటజీపై అసహనం వ్యక్తం చేస్తున్న మీడియా?

    ఈ మూవీ ప్రమోషన్స్ కూడా అదిరిపోయేలా ఉండటంతో సినిమా కోసం అభిమానులు ఆసక్తి ఎదురుచూస్తున్నారు. ‘బాహుబలి’ సిరీసుల రాజమౌళి నుంచి వస్తున్న మూవీ కావడంతో ఈ మూవీపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే మూవీ ఉండనుందని తెలుస్తోంది.

    ఇక ఈ మూవీలో రాంచరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా ఎన్టీఆర్ కు జోడీగా హలీవుడ్ నటి ఒలివియా నటిస్తోంది. కీలక ప్రాతల్లో శ్రియాశరణ్, అజయ్ దేవగణ్ నటిస్తున్నారు. విడుదలకు ముందే ఎన్నో రికార్డులను బద్దలు కొడుతున్న ‘ఆర్ఆర్ఆర్’ రిలీజు తర్వాత ఎలాంటి సంచనాలను సృష్టిస్తుందోననే టాక్ ఫిల్మ్ నగర్లో నడుస్తోంది.

    Also Read: కొమురం భీమూడో సాంగ్​ ప్రోమో రిలీజ్​.. ఎన్టీఆర్ పై రాజమౌళి ప్రేమ ఎంతో తెలిసింది