RRR Pre Release Event in Dubai: గ్రేట్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను దుబాయ్ లో గ్రాండ్ గా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

అయితే ఇప్పుడు ఆ కార్యక్రమం అక్కడే ఘనంగా జరపాలని, హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ను ముఖ్య అతిథిగా పిలవాలని చిత్రబృందం భావిస్తోందట. మార్చి 1న ఈ వేడుక నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అన్నట్టు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ వ్యూస్‌లో మరో మైలు రాయి దాటింది.
Also Read: ఎన్టీఆర్ కోసం 4 కోట్లు తీసుకున్న అలియా భట్
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 16 కోట్ల వ్యూస్‌ను సాధించింది. ఈ మూవీ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక 16 కోట్ల వ్యూస్ అంటే.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇదొక రికార్డ్. ఇక ఈ సినిమా విడుదల కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎంతైనా నిజమైన మల్టీస్టారర్ కాబట్టి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని అన్ని ముఖ్యమైన భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. పైగా ఈ సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. అందుకే హిందీలో కూడా ఈ సినిమా రిలీజ్ కోసం పడిగాపులు కాస్తున్నారు. కాగా డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపిస్తున్నాడు.
Also Read: మోడీది ఏం తప్పులేదా? ఆ రెండు పత్రికలదే తప్పా?
[…] Keerthy Suresh: కీర్తి సురేష్ ప్రస్తుతం సౌత్ టాప్ హీరోయిన్స్ లోనే మొదటి వరుస హీరోయిన్. తాజాగా కీర్తి సురేష్ తనలోని చిన్నపిల్లను బయటకు చూపించింది. ఆమె ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా షూట్ లో పాల్గొంటుంది. అయితే, ఇంతకీ అసలు మ్యాటర్ లోకి వెళ్తే.. హీరోయిన్ కీర్తి సురేష్ షూటింగ్ కోసం గోవాలోని లొకేషన్ కి వెళ్లింది అట. […]