Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప – ది రైజ్. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. కాగా ఈరోజు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.

Wishing the entire team of #Pushpa a Blockbuster Success… 🤩🙌🏻#ThaggedeLe 🤙🏻
Can't wait for audience to celebrate the MASS PARTY in theatres from today.@alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @adityamusic @TSeries @MythriOfficial @PushpaMovie pic.twitter.com/pcOxReULzq
— RRR Movie (@RRRMovie) December 17, 2021
ఇంతకాలం స్టైలిష్ పాత్రల్లో కనిపించిన అల్లు అర్జున్ ఓ లారీ డ్రైవర్‌గా ఊర మాస్ పాత్ర చేయడం, రష్మిక కంప్లీట్ డీ గ్లామర్ రోల్ చేయడం ప్రాజెక్ట్‌పై అంచనాలు మరో స్థాయికి తీసుకు వచ్చాయి. ఇక సుకుమార్ – అల్లు అర్జున్ – మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ కాంబినేషన్‌లో వచ్చిన బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్‌గాను ‘పుష్ప: ది రైజ్’ నిలిచింది.
Also Read: ‘పుష్ప’కు అక్కడ మైనస్.. ఇక్కడ ప్లస్?
ఈ క్రమంలోనే పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు పుష్ప టీమ్‌తో పాటు బన్నీకి స్పెషల్ విషెష్ తెలుపుతున్నారు. ఇటీవలే రామ్‌చరణ్, మెగాస్టార్ చిరంజీవి తదితరులు శుభాకాంక్షలు తెలపగా.. తాజాగా ఆర్ఆర్ఆర్ టీమ్ ఎనర్జిటిక్ విషెష్ తెలిపారు. బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకున్నందుకు కంగ్రాట్స్ అంటూ ట్వీట్ చేసారు. థయేటర్‌లో ప్రేక్షకులు మాస్ పార్టీ కోసం ఎదురుచూస్తున్నారు తగ్గేదేలే అంటూ బన్నీకి ఊపందించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిన చూసిన సినీ ప్రముఖులందరూ దర్శకుడు సుకుమార్ – హీరో అల్లు అర్జున్‌లతో పాటు హీరోయిన్ రష్మిక మందన్న, చిత్ర నిర్మాతల మీద ఇతర సాంకేతిక నిపుణులపైన ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Also Read: థియేటర్లో ఫ్యామిలీతో పుష్పరాజ్ సందడి.. ఎగబడిన అభిమానులు