https://oktelugu.com/

RRR : కేసీఆర్ రాంగ్.. జగనే రైటా? ఆర్ఆర్ఆర్.. సినిమా టికెట్ రేట్ తెలిస్తే మీ ఫ్యూజులు ఎగిరిపోతాయ్?

RRR Movie Ticket Prices: ఎంత 400 కోట్లు పెట్టి సినిమా తీసినా కూడా అంత ధర నిర్ణయిస్తారా? అని ఇప్పుడు ప్రేక్షకులు మండిపడుతున్నారు. ఈ టికెట్ రేటు చూస్తే ఏపీలో సీఎం జగన్ టికెట్ రేట్లు తగ్గించడం కరెక్టే అన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే సామాన్యులకు అందకుండా ఏకంగా మూడు రెట్లు ఆర్ఆర్ఆర్ టికెట్ ధరను పెంచడంపై ప్రేక్షకులు భగ్గుమంటున్నారు. ఏపీలో సినిమా టికెట్ల ధరలను జగన్ సర్కార్ తగ్గించేసింది.దీనిపై టాలీవుడ్ గుర్రుగా ఉంది. పలువురు […]

Written By:
  • NARESH
  • , Updated On : December 31, 2021 / 06:00 PM IST
    Follow us on

    RRR Movie Ticket Prices: ఎంత 400 కోట్లు పెట్టి సినిమా తీసినా కూడా అంత ధర నిర్ణయిస్తారా? అని ఇప్పుడు ప్రేక్షకులు మండిపడుతున్నారు. ఈ టికెట్ రేటు చూస్తే ఏపీలో సీఎం జగన్ టికెట్ రేట్లు తగ్గించడం కరెక్టే అన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే సామాన్యులకు అందకుండా ఏకంగా మూడు రెట్లు ఆర్ఆర్ఆర్ టికెట్ ధరను పెంచడంపై ప్రేక్షకులు భగ్గుమంటున్నారు.

    RRR movie tickets

    ఏపీలో సినిమా టికెట్ల ధరలను జగన్ సర్కార్ తగ్గించేసింది.దీనిపై టాలీవుడ్ గుర్రుగా ఉంది. పలువురు సినీ ప్రముఖులు దీనిపై తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తెలంగాణలో సినిమా రేట్లను ఇష్టారీతిన పెంచుకునే స్వేచ్ఛనిస్తూ కేసీఆర్ ప్రభుత్వం జీరో జారీ చేసింది.

    దొరికింతే తడువుగా తాజాగా ప్యాన్ ఇండియా మూవీగా వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ కు రేటును అమాంతం పెంచేశారు. శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోనే చిన్న సినిమాలకు తక్కువ ధరలోనే థియేటర్లు టికెట్లు అమ్మాలని నిర్ణయించారు. మధ్యస్థాయి సినిమాలు విడుదలైన రెండు వారాల పాటు గరిష్ట ధరకు టికెట్ లు అమ్మాలని.. ఆ తర్వాత తగ్గించాలని నిర్ణయించారు.

    ఇక ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బడ్జెట్ చిత్రాలకు మూడు వారాల పాటు గరిష్ట ధరలకు టికెట్ అమ్మాలని.. ఆ తర్వాత తగ్గించాలని ప్రభుత్వం, తెలంగాణ ఫిలించాంబర్ నిర్ణయించింది.

    ఈ క్రమంలోనే జనవరి 7న రిలీజ్ అవుతున్న ప్యాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’కు సింగిల్ స్క్రీన్ థియేటర్ లో టికెట్ రేటు రూ.175 కాగా.. మల్టీపెక్స్ లో మాత్రం వాచిపోయేలా రూ.295గా టికెట్ రేటు నిర్ణయించారు. ఇన్నాళ్లు మల్టీపెక్స్ లో రూ.100 నుంచి 150 వరకూ టికెట్ రేటు ఉండేది.ఇప్పుడు దాన్ని మూడింతలు పెంచి ఏకంగా రూ.295 చేసి ప్రేక్షకులకు వాత పెట్టారు. ఈ రేట్లు చూసి సినీ ప్రేక్షకులు సైతం మండిపడుతున్నారు. పెంచమంటే మరీ ఇంత పెంచడమా? అని మండిపడుతున్నారు. ఆర్ఆర్ఆర్ టికెట్ ధర చూసి ఆ సినిమా చూడకపోతేనే బెటర్ అని డిసైడ్ అవుతున్నారు.

    సామాన్యుడి నడ్డివిరిచేలా తెలంగాణలో సినిమా టికెట్ ధరలు నిర్ణయించారని.. ఈ ధరల మోత చూస్తే ఏపీలో తగ్గించిన సీఎం జగన్ నిర్ణయం కరెక్ట్ అంటున్నారు.

    Tags