RRR Movie: ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో జూనియర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. కాగా వీరి సరసన ఒలీవియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్స్ నటిస్తున్నారు. కాగా అజయ్ దేవగన్, శ్రియ , సముద్రఖని ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్లు, వీడియో లకు అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. కాగా తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ గ్లింప్స్ ను మూవీ యూనిట్ విడుదల చేసింది.
ఈ సెకండ్ గ్లింప్స్ 40 సెకండ్లు మాత్రమే అయిన రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ దుమ్ము రేపారు అని చెప్పొచ్చు. ముఖ్యంగా విజువల్స్, కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అని చెప్పవచ్చు. సినిమాని చాలా గ్రాండియర్‌గా తెరకెక్కిస్తున్నట్లు అర్దం అవుతుంది. ముఖ్యంగా బ్రిటీషర్లపై ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగన్ పోరాడే సీన్లు సినిమాను మరో రేంజ్ కు తీసుకెళ్తాయి. రాజమౌళి మార్క్ తో రికార్డుల మోత ఖాయం అనిపిస్తుంది. డైలాగ్ లేకపోయిన కూడా ఎన్టీఆర్, రామ్ చరణ్ కళ్ళతోనే మ్యాజిక్ చేశారు. గ్లింప్స్ మొత్తం మీద… చివర్లో పులి పంజా విసురుతూ ఉండే సీన్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ప్రస్తుతం ఈ గ్లింప్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
The era of #RRRMovie has just begun!
Presenting the much anticipated #RRRGlimpse…https://t.co/khszq8EcOg
Let's together bring back the glory of Indian cinema. In cinemas from 7th Jan 2022.@ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @oliviamorris891 @DVVMovies— RRR Movie (@RRRMovie) November 1, 2021
కాగా ఇటీవలే దేశంలోనే మొదటిసారిగా అతి పెద్ద మల్టీప్లెక్స్ చైన్ సిస్టం కలిగిన పీవీఆర్ సంస్థతో… ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ డీల్ కుదుర్చుకుంది. పీవీఆర్ సినిమాస్‌కి సంబంధించిన అన్ని మల్టీప్లెక్స్‌ల పేరును… పీవీఆర్ఆర్‌ఆర్ గా మార్పు చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ… ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అటు చరణ్, తారక్ సైతం ఈ మూవీ డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేశారు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Rrr movie second glimps released
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com