https://oktelugu.com/

RRR Movie: ప్రమోషన్స్ కోసం “ఆర్‌ఆర్‌ఆర్” యూనిట్ ఎంత ఖర్చు పెట్టారో తెలుసా ?

RRR Movie: దేశవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులను ఎంతో ఆతృతగా ఎదురుచూసేలా చేస్తున్న మూవీ ఆర్​ఆర్​ఆర్​. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్​, రామ్​ చరణ్ హీరోలుగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, వీడియోలు, పాటలు నెట్టింట ట్రెండింగ్​ గా నిలిచాయి. పాన్ ఇండియా రిలీజ్ కావడంతో దర్శకధీరుడు రాజమౌళి తన ఇద్దరు హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్స్ ను ఓ రేంజ్ లో చేశారు. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 3, 2022 / 01:51 PM IST
    Follow us on

    RRR Movie: దేశవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులను ఎంతో ఆతృతగా ఎదురుచూసేలా చేస్తున్న మూవీ ఆర్​ఆర్​ఆర్​. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్​, రామ్​ చరణ్ హీరోలుగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, వీడియోలు, పాటలు నెట్టింట ట్రెండింగ్​ గా నిలిచాయి. పాన్ ఇండియా రిలీజ్ కావడంతో దర్శకధీరుడు రాజమౌళి తన ఇద్దరు హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్స్ ను ఓ రేంజ్ లో చేశారు. ముంబై, చెన్నై, కేరళ, బెంగుళూరు అంటూ గ్యాప్ లేకుండా తిరిగారు.

    ప్రీరిలీజ్ ఈవెంట్స్, ప్రెస్ మీట్స్ తో బిజీగా గడిపారు. కానీ ఊహించని విధంగా జనవరి 7న విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు వాయిదా పడింది. ముంబై, ఢిల్లీలలో కర్ఫ్యూలు విధించడం తమిళనాడు రాష్ట్రంలో థియేటర్ అక్యుపెన్సీ యాభై శాతం చేయడం, ఏపీలో టికెట్ రేట్ ఇష్యూ… ఇవన్నీ కలిపి ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడేలా చేశాయి. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం నిర్మాత ఎంత ఖర్చు పెట్టారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దాదాపు 50కి పైగా ఇంటర్వ్యూలలో రాజమౌళి, తారక్, చెర్రీ పాల్గొన్నార.

    ఈ ప్రమోషన్స్ కోసం దాదాపు రూ. 15 నుంచి 20 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇక ఆర్‌ఆర్‌ఆర్ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించే వరకు ఈ బజ్ ఎంత వరకు ఉంటుందో చెప్పలేం. కాబట్టి మళ్లీ ఫ్రెష్ గా ప్రమోషన్స్ చేసుకోవాలి. మొత్తానికి ఈ సినిమాతో నిర్మాత దానయ్య ఆర్థికంగా బాగా ఎఫెక్ట్ అవుతున్నట్లు ప్రేక్షకులు భావిస్తున్నారు.