Homeఎంటర్టైన్మెంట్Revolt Of Bheem: భీమ్​ త్యాగాన్ని ఆవిష్కరిస్తూ 'కొమురం భీమూడో' సాంగ్​.. నెట్టింట్లో వైరల్​

Revolt Of Bheem: భీమ్​ త్యాగాన్ని ఆవిష్కరిస్తూ ‘కొమురం భీమూడో’ సాంగ్​.. నెట్టింట్లో వైరల్​

Revolt Of Bheem: టాలీవుడ్​ టాప్​ మోస్ట్ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా ఆర్​ర్​ఆర్​ఆర్​. దేశవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామ్​చరణ్​, తారక్​ హీరోలుగా వస్తోన్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మించారు. ఇప్పటికే షూటింగ్​ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. జనవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్​ను భారీగా ప్లాన్​ చేశారు రాజమౌళి. కాగా, ఇటీవలే విడుదలైన ట్రైలర్​తో సినిమాపై అంచనాలు ఎక్కడికో  వెళ్లిపోయాయి.

ఈ క్రమంలోనే ప్రమోషన్స్​లో ఫుల్ జోరు పెంచారు రాజమౌళి. ఓ వైపు ప్రెస్​మీట్లు, ఈవెంట్లతో ప్రేక్షకులను పలకరిస్తూనే… మరోవైపు సామాజిక మాధ్యమాల్లో సినిమా అప్​డేట్లు ఇస్తూ మరింత హైప్​ క్రియేట్ చేస్తున్నారు. ఇటీవలే మేకోవర్స్ పేరుతో రామ్​, భీమ్​లకు సంబంధించిన వీడియోలు చేయగా.. తాజాగా, రివోల్ట్ ఆఫ్ భీమ్ టైటిల్​తో కొమురం భీమూడో సాంగ్ విడుదల చేసింది చిత్రబృందం. సుద్దాల అశోక్ తేజ ఈ పాటకు రచన అందించగా.. కాల భైవర ఆలపించారు. ఎంఎం కీరవాణి ఈ సినిమాకు స్వరాలు అందించారు.

komuram-bheemudo-song-promo-released-from-rrr-movie

లిరిక్స్ వింటుంటే.. కొమురం భీమ్ గొప్పతనాన్ని, అతని ఖ్యాతిని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నట్లు ఉంది. ఆయన చరిత్రతో పాటు.. దేశం కోసం ఆయన చేసిన పోరు పాటలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పాట కోసం సుద్దాల ప్రాణం పెట్టినట్లు క్లియర్ గా తెలుస్తోంది.  గొండు జాతి కోసం భీమ్ చేసిన త్యాగాన్ని ఈ పాట ద్వారా గుర్తుచేశారు. చివర్లో పుడమి తల్లికి జన్మ.. మరణమిస్తివిరో అన్న లైన్ వింటుంటే.. భీమ్ యుద్ధంలో వీర మరణం పొందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular