RRR Movie Ignores Print Media: ప్రస్తుతం ఇటు మీడియాలో గానీ.. అటు సోషల్ మీడియాలో గానీ.. ఎక్కడ చూసినా ఆర్ ఆర్ ఆర్ టీమ్ హవానే కనిపిస్తోంది. వాట్సాప్ నుంచి మొదలు పెడితే.. ట్విట్టర్ దాకా త్రిపుల్ ఆర్ ట్రెండ్ నడుస్తోంది. దేశ వ్యాప్తంగా ప్రమోషన్స్ చేస్తూ జక్కన్న ఎక్కడ లేని హైప్‌ను తీసుకు వస్తున్నాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లను వెంట బెట్టుకుని దేశం మొత్తం సుడిగాలి పర్యటన చేస్తున్నాడు.
ఒకే రోజులో కావాల్సినన్ని ఇంటర్వ్యూలు ఇస్తూ.. మూవీకి కావాల్సినంత బజ్ తీసుకు వస్తున్నాడు. సినిమా మేకింగ్ లో అయినా.. ప్రమోషన్స్‌లో అయినా జక్కన్న స్టైలే వేరు. అయితే ఇక్కడే ఆయన తీరు చర్చనీయాంశం అవుతోంది. జక్కన్న ప్రమోషన్స్‌లో కేవలం డిజిటల్ మీడియానే నమ్ముకుంటున్నాడు. కానీ ప్రింట్ మీడియాకు మాత్రం అవకాశం ఇవ్వట్లేదు.
Also Read: RRR Movie First US Review: ‘ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ యూఎస్ రివ్యూ
ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలను రికార్డ్ చేసి ఛానెళ్స్‌కు ఇచ్చాడు. ఇక చివరి నిముషంలో బాగోదని కొన్ని టీవీ చానెళ్లను పిలిచి ఇంటర్వ్యూలు ఇప్పించాడు జక్కన్న. కానీ ఎక్కడా కూడా ప్రింట్ మీడియాకు ఒక్కటంటే ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వట్లేదు. బాహుబలి సమయంలో ఈనాడు, సాక్షి లాంటి పెద్ద పేపర్లకు పిలిచి మరీ కావాల్సినన్ని ఇంటర్వ్యూలు ఇప్పించిన రాజమౌళి.. ఈ సారి మాత్రం పేపర్లను పక్కన పడేశాడు.
రెగ్యులర్ గా పేపర్ వాళ్లకు ఇచ్చే యాడ్లు కూడా ఈ సారి త్రిపులర్ విషయంలో ఇవ్వట్లేదు. మొదటి నుంచి యాడ్లపై ఖర్చు చేసేందుకు రాజమౌళి ఆసక్తి చూపట్లేదు. కాగా ఇప్పుడు కనీసం ఇంటర్వ్యూలు కూడా ఇవ్వకుండా వివక్ష చూపిస్తున్నారని ప్రింట్ మీడియా అంటోంది. దీంతో ఆర్ ఆర్ ఆర్ టీమ్ మీద ప్రస్తుతం ప్రింట్ మీడియా ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read ఆర్ఆర్ఆర్ థియేటర్ల ఓనర్లకు షాక్.. ఏపీలో రంగంలోకి రెవెన్యూ అధికారులు..
Recommended Video: