RRR Movie First Full Review and Rating: ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ డిటైల్డ్ రివ్యూ క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ భారతీయ బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టడానికి సన్నద్ధం అయ్యింది. ఇప్పటివరకు ఉన్న భారీ రికార్డులన్నీ బద్ధలు కాబోతున్నాయి. ఈ క్రమంలో ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను ఆల్ రెడీ చూసిన ఓవర్‌సీస్ సెన్సార్ బోర్డు మెంబర్ ఉమైర్ సంధు.. ఈ సినిమాకు రివ్యూ ఇస్తూ.. ఐదు స్టార్ల రేటింగ్ ఇచ్చాడు.
ఫిల్మ్ క్రిటిక్ గా ఉమైర్ సంధుకు మంచి నేమ్ ఉంది. గతంలో అతను ముందుగానే ‘దంగల్, బాహుబలి 2’, ‘రాధేశ్యామ్’ సినిమాల విషయంలో ఇలాగే రివ్యూ ఇచ్చాడు. అవి నిజం అయ్యాయి కూడా. కాబట్టి ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో కూడా నిజం అవుతుందని నమ్మకం ఉంది. ఇంతకీ ఉమైర్ సంధు ‘ఆర్ఆర్ఆర్’ రివ్యూలో ఏమి చెప్పాడంటే..
విశ్లేషణ :
‘భారతీయ సినీ పరిశ్రమ పెద్ద కలలు కనడమే కాదు, వాటిని సాకారం కూడా చేసుకోవచ్చని నిరూపించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ అద్భుత చిత్రాన్ని ఎవరూ మిస్ కాకండి. ఇప్పటికీ ఇది బ్లాక్ బస్టర్ అయినా, రేపటి తరానికి ఇదొక క్లాసిక్.
నటి నటీనటుల విషయానికి వస్తే.. ఎన్టీఆర్ – చరణ్ అద్భుతంగా నటించారు. వారి కాంబినేషన్ అదిరింది. అజయ్ దేవ్‌గణ్ అయితే, ఒక సర్‌ప్రైజ్ ప్యాకేజీ. ఎందుకో తెలియదు.. ఆలియా భట్ ఈ సినిమాలో మరింత అందంగా కనిపించింది.
ఇక ఈ సినిమాతో రాజమౌళి ఇండియాలోనే నెంబర్ 1 డైరెక్టర్ గా మారిపోయాడు అంటూ ఉమైర్ జక్కన్న పై ప్రశంసలు కురిపించాడు.
మెయిన్ హైలైట్స్ విషయానికి వస్తే… జూనియర్ ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ టాక్ ఆఫ్ ది టౌన్. దర్శక ధీరుడు ఎన్టీఆర్ ను హైలైట్ చేయడానికి మొదటి నుంచి క్రేజీగా ప్లాన్ చేస్తూ వచ్చాడు. పైగా ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉంటుంది. దీనికితోడు ఈ సినిమాలో ఎన్టీఆర్ డైలాగ్ లు అద్భుతంగా ఉన్నాయి.
అందుకే, సినిమాలో ప్రధాన హైలెట్స్ లో ఎన్టీఆర్ డైలాగ్ లే మెయిన్ హైలెట్ అయ్యాయి. ముఖ్యంగా తెలంగాణ యాసలో ఎన్టీఆర్ పలికే డైలాగ్ లు చాలా గొప్పగా ఉన్నాయి. అన్నిటికి మించి ఎన్టీఆర్ ఈ సినిమాలో మొత్తం మూడు గెటప్స్ లో కనిపించాడు. పైగా ఎన్టీఆర్ సీన్స్ అన్నీ అద్భుతంగా వచ్చేలా రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు.
అదే విధంగా ‘ఎన్టీఆర్ – ఓలివియా’ లవ్ ట్రాక్ కూడా బాగా హైలైట్ ఉంది. వీరి మధ్య ఎక్కడా సింగిల్ డైలాగ్ కూడా ఉండడు. కేవలం వారి మధ్య చోటు చేసుకున్న కొన్ని సంఘటనల కారణంగా ఓలివియా, ఎన్టీఆర్ పై ఘాడమైన ప్రేమను పెంచుకుంటుంది. చివరికీ ఎన్టీఆర్ మీద ప్రేమతోనే భారత దేశం కోసం ఆమె తన ప్రాణాలను సైతం అర్పిస్తోంది. ఓలివియా త్యాగంతో ముగిసే వీరి ట్రాక్ సినిమాలోనే హెవీ ఎమోషనల్ హైలైట్ గా నిలిచింది.
ఎన్టీఆర్ – చరణ్ మొదటి సారి కలుసుకునే సన్నివేశం కూడా గూస్ బంప్స్ వస్తాయి. అలాగే పులితో ఎన్టీఆర్ చేసే ఫైట్ కూడా సినిమాలో మరో ప్రధాన హైలైట్ గా నిలిచింది.
డైరెక్షన్ లో తనను బీట్ చేసే వారు లేరని.. రాజమౌళి మరోసారి ఘనంగా నిరూపించాడు. మొత్తమ్మీద ఈ చిత్రం ఎమోషనల్ డ్రామా.. భారీ యాక్షన్.. భారీ తారాగణం.. థ్రిల్లింగ్.. మిస్టరీ అండ్ రొమాంటిక్’ గా సాగుతూ అబ్బుర పరుస్తోంది. ఇక సాంకేతికంగా ఈ సినిమా మాస్టర్ పీస్. యాక్షన్ సన్నివేశాలతో పాటు విజువల్స్ హాలీవుడ్ సినిమా స్థాయిలో అదిరిపోయాయి. తెలుగు తెరపై ఇలాంటి ఎమోషనల్ యాక్షన్ సీన్స్ ఇప్పటివరకు చూడలేదు. ఇక ఈ సినిమా ముగింపు ఊహించుకోవడం కూడా కష్టమే. అందుకే… డోంట్ మిస్ ఇట్.