https://oktelugu.com/

RRR Movie Box Office Records: బాక్సాఫీస్ పై మెగా – నందమూరి తుఫాన్‌

RRR Movie Box Office Records: ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర యూనిట్ చిత్ర ప్రమోషన్ లలో బిజీ బిజీ గా గడుపుతున్నారు. ఈరోజు ఉదయం కోల్ కత్తా లో సందడి చేయగా.. సాయంత్రం వారణాసిలో సందడి చేసారు. దీనికి సంబదించిన పిక్స్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ట్విట్టర్ లో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : March 23, 2022 / 02:28 PM IST
    Follow us on

    RRR Movie Box Office Records: ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర యూనిట్ చిత్ర ప్రమోషన్ లలో బిజీ బిజీ గా గడుపుతున్నారు. ఈరోజు ఉదయం కోల్ కత్తా లో సందడి చేయగా.. సాయంత్రం వారణాసిలో సందడి చేసారు.

    Charan, Tarak

    దీనికి సంబదించిన పిక్స్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ట్విట్టర్ లో సినిమా తాలూకా వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నారు. మొత్తానికి మార్చి 25న మెగా – నందమూరి తుఫాన్‌ ఎలా ఉంటుందో RRR థియేటర్లు చెప్పనున్నాయి. అయితే ఇక్కడే అభిమానులకి షాక్‌ ఇచ్చారు థియేటర్‌ ఓనర్స్‌.

    Also Read:   అత్య‌ధిక టికెట్లు అమ్ముడు పోయిన ఇండియ‌న్ సినిమాలు ఇవే.. బాహుబ‌లి స్థానం ఎంతంటే..?

    తమ హీరోలని చూసి ఉక్రోశంతో, ఉన్మాదంతో తెర వద్దకు వెళ్లి గంతులేశారో, మీ కాళ్లకి మేకులు దిగడం ఖాయం. అవును నిజమే. ఎక్కడ అభిమానులు తెరల్ని చించేస్తారో అని కొంతమంది ఓనర్లు పోడియంపై మేకులు కొట్టడం, తెర ముందు మెస్సు భిగించడం చేస్తున్నారట. తస్మాత్‌ జాగ్రత్త! అన్నట్టు RRR చిత్రానికి ఆదిలోనే ప్రథమ విఘ్నం ఎదురైంది.

    Rajamouli with NTR and Ramcharan

    అదే.. ది కశ్మీర్‌ ఫైల్స్‌. వాస్తవానికి ఈ చిత్రం ఇంత పెద్ద హిట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. మొదట RRRకి హిందీ బెల్ట్‌లో 4 వేల స్క్రీన్స్‌ లభిస్తాయనుకున్నారు. కానీ ఆ సంఖ్యను ది కశ్మీర్‌ ఫైల్స్‌ తన్నుకుపోయింది. ఈక్రమంలో హిందీలో RRR మొదటి రోజు వసూళ్ల అంచనా రూ. 30 కోట్ల నుండి రూ. 19 కోట్లకు పడిపోయింది. మరి ఈ అంచనాలను జక్కన తలకిందులు చేస్తాడా?

    Also Read: ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ డిటైల్డ్ రివ్యూ

    Tags