RRR Closing Collection: ఆర్ ఆర్ ఆర్ వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్..!

RRR Closing Collection: ఆర్ ఆర్ ఆర్ విడుదలై రెండు నెలలు దాటుతున్నా అక్కడక్కడ ప్రదర్శించబడుతూనే ఉంది. ఓటీటీలోకి వచ్చి నెలరోజులు అవుతునప్పటికీ ఈ చిత్ర థియేట్రికల్ రన్ ముగియలేదు. దానికి తోడు జూన్ 1న యూఎస్ లో ఆర్ ఆర్ ఆర్ రీరిలీజ్ చేశారు. రీ రిలీజ్ కి భారీ రెస్పాన్స్ దక్కింది. అమెరికాలో ఇండియన్ చిత్రాలను ఇండియన్స్ మాత్రమే చూస్తారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని అమెరికన్ ప్రేక్షకులు, చిత్ర ప్రముఖులు ప్రత్యేకంగా చూడటం […]

Written By: Shiva, Updated On : June 16, 2022 1:47 pm

RRR

Follow us on

RRR Closing Collection: ఆర్ ఆర్ ఆర్ విడుదలై రెండు నెలలు దాటుతున్నా అక్కడక్కడ ప్రదర్శించబడుతూనే ఉంది. ఓటీటీలోకి వచ్చి నెలరోజులు అవుతునప్పటికీ ఈ చిత్ర థియేట్రికల్ రన్ ముగియలేదు. దానికి తోడు జూన్ 1న యూఎస్ లో ఆర్ ఆర్ ఆర్ రీరిలీజ్ చేశారు. రీ రిలీజ్ కి భారీ రెస్పాన్స్ దక్కింది. అమెరికాలో ఇండియన్ చిత్రాలను ఇండియన్స్ మాత్రమే చూస్తారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని అమెరికన్ ప్రేక్షకులు, చిత్ర ప్రముఖులు ప్రత్యేకంగా చూడటం విశేషం. ఆర్ ఆర్ ఆర్ తో రాజమౌళి ప్రపంచ స్థాయి దర్శకుడిగా నిరూపించుకున్నాడు. హాలీవుడ్ ప్రముఖులు ఆయన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.

RRR MOVIE

అమెరికన్ రైటర్ లారీ కరస్జెవ్స్కీ ఈ సినిమా గురించి ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. ‘సినిమా చచ్చిపోతుంది అంటున్నవారు ఇంకా ఆర్ ఆర్ ఆర్ చూడ లేదా” అంటూ ట్వీట్ చేశారు. తన ట్వీట్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల డాన్స్ బీట్ ”నాటు నాటు” వీడియో ట్యాగ్ చేశాడు. ఆర్ ఆర్ ఆర్ లాంటి చిత్రాలు సినిమా గౌరవాన్ని పెంచుతున్నాయన్న అభిప్రాయం ఆయన ట్వీట్ ద్వారా వెల్లడించారు. రైటర్ లారీ ప్రశంస నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ టీమ్ స్పందించారు. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. యూఎస్ లో బాహుబలి 2 తర్వాత భారీ వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా ఆర్ ఆర్ ఆర్ రికార్డులకు ఎక్కింది.

Also Read: Telugu Indian Idol : తెలుగు ఇండియన్ ఐడల్ విజేతగా ఆమె.. చిరంజీవి చేతులమీదుగా ట్రోఫీ!

ఇక ఆర్ ఆర్ ఆర్ వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్టన్స్ ఈ విధంగా ఉన్నాయి. అన్ని భాషల్లో కలిపి రూ. 1118 వరల్డ్ వైడ్ గ్రాస్ ఈ చిత్రం అందుకుంది. రూ. 557 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ రాబట్టినట్లు సమాచారం. బాహుబలి 2, ఆర్ ఆర్ ఆర్ చిత్రాల తర్వాత ఆల్ టైం టాప్ లిస్ట్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ చేరింది. ఏపీ/ తెలంగాణాలలో ఈ మూవీ బాహుబలి 2 రికార్డు బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. యూఎస్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ $ 27.5 మిలియన్ వసూళ్లు అందుకుంది.

RRR

రాజమౌళితో పాటు ఆర్ ఆర్ ఆర్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ గ్లోబల్ ఫేమ్ అందుకున్నారు. వీరి గురించి హాలీవుడ్ మీడియా ప్రత్యేక కథనాలు ప్రచురిస్తుంది. ఓ ఫిక్షనల్ కథగా ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కించారు. ఎన్టీఆర్ భీమ్ గా, చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటించారు. విజయేంద్ర ప్రసాద్ కథ సమకూర్చారు. రూ. 500 కోట్ల బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మించారు. కీరవాణి సంగీతం అందించారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటించగా, అజయ్ దేవగణ్, శ్రీయా, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ కీలక రోల్స్ లో కనిపించారు.

Also Read:Chandrababu Naidu: చంద్రబాబును ఆవహించిన త్రివిక్రమ్.. విన్న వారంతా షాక్

Tags