https://oktelugu.com/

RRR 2nd Day Collections: రెండో రోజూ విశ్వ ప్రభంజన విజృంభణే

RRR 2nd Day Collections: విపరీతమైన అంచనాల మధ్య విడుదల అయిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అద్భుతమైన టాక్ తో ఫస్ట్ డే కలెక్షన్స్ తో పాటు సెకండ్ డే కలెక్షన్స్ విషయంలోనూ అదరగొట్టింది. ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్స్ కి సంబంధించి.. బాక్సాఫీస్ నుంచి లేటెస్ట్‌గా కలెక్షన్స్ రిపోర్ట్స్ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్స్ విషయంలో దుమ్ము లేపుతుంది. ఓవర్సీస్ లో సైతం ఈ సినిమా భారీ రికార్డుల క్రియేట్ చేసింది. మొత్తం మీద సినిమా రెండో రోజు కూడా […]

Written By:
  • Shiva
  • , Updated On : March 27, 2022 / 10:23 AM IST
    Follow us on

    RRR 2nd Day Collections: విపరీతమైన అంచనాల మధ్య విడుదల అయిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అద్భుతమైన టాక్ తో ఫస్ట్ డే కలెక్షన్స్ తో పాటు సెకండ్ డే కలెక్షన్స్ విషయంలోనూ అదరగొట్టింది. ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్స్ కి సంబంధించి.. బాక్సాఫీస్ నుంచి లేటెస్ట్‌గా కలెక్షన్స్ రిపోర్ట్స్ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్స్ విషయంలో దుమ్ము లేపుతుంది. ఓవర్సీస్ లో సైతం ఈ సినిమా భారీ రికార్డుల క్రియేట్ చేసింది. మొత్తం మీద సినిమా రెండో రోజు కూడా అద్భుతమైన కలెక్షన్స్ ను రాబట్టింది. ఏరియాల వారీగా కలెక్షన్స్ గమనిస్తే..

    RRR 2nd Day Collections

    Also Read: Ram Charan Birthday Special: చరణ్ బర్త్ డే స్పెషల్.. చెర్రీ ఎప్పటికీ ప్రత్యేకమే

    నైజాం 21.30 కోట్లు

    సీడెడ్ 16.00 కోట్లు

    ఉత్తరాంధ్ర 06.40 కోట్లు

    ఈస్ట్ 05.35 కోట్లు

    వెస్ట్ 04.93 కోట్లు

    గుంటూరు 07.80 కోట్లు

    కృష్ణా 03.20 కోట్లు

    నెల్లూరు 02.10 కోట్లు

    ఏపీ + తెలంగాణలో కలుపుకుని మొత్తం 66.99 కోట్లు కలెక్ట్ చేసింది.

    తమిళ్ నాడు 03.92 కోట్లు

    కేరళ 01.71 కోట్లు

    కర్ణాటక 07.13 కోట్లు

    నార్త్ ఇండియా (హిందీ) 07.25 కోట్లు

    ఓవర్సీస్ 34.00 కోట్లు

    రెస్ట్ 01.50 కోట్లు

    ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ సెకండ్ డే కలెక్షన్స్ : రూ.123.50 కోట్లు

    RRR

    ఒక ఇండియన్ సినిమా సెకండ్ డే కలెక్షన్స్ లో కూడా ఈ రేంజ్ ఫిగర్ ను నెలకొల్పడం సరి కొత్త రికార్డ్. హాలీవుడ్ భారీ సినిమాలకు వచ్చిన రేంజ్ లో.. సెకండ్ డే కూడా ఈ సినిమాకి కలెక్షన్స్ రావడం ఇండియన్ సినీ ఇండస్ట్రీకే గర్వకారణం. ఎలాగూ ఎన్టీఆర్ – చరణ్ పేర్లు వింటేనే చాలు.. ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తాయి. అలాంటి హీరోలు కలిసి నటించిన సినిమా అంటే.. అది అమెరికా అయినా, అనకాపల్లి అయినా ఫ్యాన్స్ కు అదో పెద్ద పండుగే.

    ప్లేస్ ఎక్కడైనా ఆడియన్స్ ఎవరైనా థియేటర్స్ వద్ద కోలాహలం భారీ స్థాయిలో ఉంటుంది. ప్రస్తుతం అలాగే ఉంది. చాలా మంది ఫస్ట్ డేకే కాదు సెకండ్ డే రోజు కూడా మూవీ చూసేందుకు ఎగబడ్డారు. ఈ సినిమా అద్భుత హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో ఇక ఈ చిత్రానికి తిరుగు లేకుండా పోయింది. ఈ చిత్రం దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లో బాక్సాఫీస్ వద్ద తన ప్రభావాన్ని తన ప్రభంజనాన్ని సగర్వంగా చాటుకుంది.

    Also Read: Comedian Prithviraj Interesting Comments: కమెడియన్ పృథ్వీకి ఇప్పుడు బుద్దొచ్చిందట?

    Tags