RRR Movie Actors Remuneration: ‘ఆర్ఆర్ఆర్’.. పాన్ ఇండియా స్థాయిలోనే అత్యంత భారీ మల్టీస్టారర్, ఎన్టీఆర్ – రామ్ చరణ్ లతో పాటు అజయ్ దేవగన్, అలియా లాంటి తారాగణం నటించిన సినిమా ఇది. అజయ్ దేవగన్ హిందీలో స్టార్ హీరో. అలియా నంబర్ వన్ లిస్ట్ లో ఉన్న హీరోయిన్. మరి, వీళ్లకు ఏ లెక్కన రెమ్యునరేషన్ ఇచ్చి ఉంటారు ? సినిమాకి 400 కోట్లు బడ్జెట్ అంటున్నారు. ఇక దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రెమ్యునరేషన్ కూడా హీరోల కంటే ఎక్కువే ఉండి ఉంటుంది.

ఈ లెక్కలన్నీ చూసుకుంటే.. అసలు ఆర్ఆర్ఆర్ సినిమాకి ఇప్పటిదాకా అయిన బడ్జెట్ ఎంత ? ఎవరికి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారో చూద్దాం.
ఎన్టీఆర్ కి ఎంత ఇచ్చారంటే ?

ఎన్టీఆర్ ఈ సినిమా కోసం 46 కోట్ల పారితోషికం తీసుకున్నాడు. ఈ సినిమాకి ముందు ఎన్టీఆర్ 32 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకున్నాడు. అయితే, ఆర్ఆర్ఆర్ కోసం అదనపు డేట్లు కేటాయించాడు కాబట్టి.. 47 కోట్లు ఇచ్చారు.
రామ్ చరణ్ రెమ్యూనరేషన్ విషయానికి వస్తే.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్ లోనే అత్యధిక పారితోషికం తీసుకుంది ఈ సినిమాకే. మొత్తంగా 44 కోట్ల వరకు తీసుకున్నాడు. చరణ్ కి ఎన్టీఆర్ కంటే రెండు కోట్లు తక్కువ ఇచ్చారు. అంతకు ముందు హీరోలకు ఉన్న మార్కెట్ ను బట్టి అంచనా వేసి జక్కన్న రెమ్యునరేషన్స్ ను ఫిక్స్ చేశారు.
అలియా ఎంత పుచ్చుకుందో తెలుసా ?

ఆమెకు ఈ సినిమాకు గాను 9 కోట్ల వరకు పారితోషికం ఇచ్చారు. నిజానికి అలియా బాలీవుడ్ సినిమా గానూ కేవలం 6 కోట్లు మాత్రమే తీసుకుంటుంది. కానీ ఈ సినిమాకి ఆమెకు అదనపు పారితోషికం ఇచ్చారు. కారణం.. ప్రమోషన్స్ లో కూడా పాల్గొనాలి అనే షరతు మీద ఆమెకు అంత ఇవ్వడం జరిగింది.
అజయ్ దేవ్ గన్ రెమ్యునరేషన్ ఫిగర్ ఇదే !

అజయ్ దేవ్ గన్ రెమ్యునరేషన్ విషయంలో ఆర్ఆర్ఆర్ టీమ్ చాలా రిస్క్ చేసింది. అజయ్ దేవగన్ కి 25 కోట్ల వరకు పారితోషికం ఇచ్చారు. అసలు ఆర్ఆర్ఆర్ అజయ్ దేవగన్ కేవలం అతిథి పాత్ర. అయితే, బాలీవుడ్ ఇండస్ట్రీలో అజయ్ దేవ్ గన్ కి ఉన్న మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని 25 కోట్ల వరకు ఇచ్చారు.
ఇక ఈ సినిమాకు ఇప్పటివరకు 410 కోట్లు ఖర్చు అయింది.
[…] Directors Who Not Released Films: ఒకప్పటి లాగా హీరోలు ఫాస్ట్ గా సినిమాలు చేయట్లేదు. రెండేళ్లకు, మూడేళ్లకు ఓ సినిమా చేస్తున్నారు. డైరెక్టర్లు కూడా ఇలాగే లేటుగా సినిమాలు చేస్తున్నారు. 2021లో వస్తారనుకున్న చాలా మంది డైరెక్టర్లు నిరాశ పరిచారు. ఇలా లేటుగా సినిమాలు రిలీజ్ చేయబోతున్న డైరెక్టర్లు ఎవరెవరు ఇప్పుడు తెలుసుకుందాం. […]
[…] Ashleigh Barty: World number one makes shock call to quit tennis: 3 సార్లు గ్రాండ్ స్లామ్ గెలిచి.. ప్రస్తుతం ప్రపంచ నంబర్ 1 గా ఉన్న క్రీడాకారిణి ఆష్లీ బార్టీ సడెన్ గా రిటైర్ మెుంట్ ప్రకటించడం సంచలనమైంది. ఆయన వయసు కూడా ఏమీ అయిపోయలేదు. కేవలం 25 ఏళ్లకే ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించి క్రీడా ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ మేరకు ఆస్ట్రేలియన్ టెన్నిస్ సంచలనం బుధవారం సోషల్ మీడియాలో తన రిటైర్ మెంట్ ప్రకటించి అందరినీ షాక్ కు గురిచేసింది. టెన్నిస్ వదిలేసి తన ఇతర కలలను నెరవేర్చుకునేందుకు వెళుతున్నట్టు పేర్కొంది. […]
[…] […]