
‘అలీతో సరదాగా’ షోలో రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ‘ఆర్ఆర్ఆర్’ కథ గురించి చెప్పి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. కథలోని ఒక సీన్ ను వివరించి అభిమానులకు ఫిదా చేశారు. స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ తాజాగా ఆర్ఆర్ఆర్ గురించి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
ఆర్ఆర్ఆర్ సినిమాలో పరిస్థితుల ప్రభావం వల్ల ఇద్దరు హీరోలైన రాంచరణ్, ఎన్టీఆర్ కొట్టుకుంటారని.. వీరిద్దరి ఫైట్ చూస్తే నాకే కన్నీళ్లు వచ్చాయని విజయేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు.
వీరిద్దరూ పోరాడే క్రమంలో ఒకరినొకరు కొట్టుకుంటారని.. అది చూస్తే ప్రేక్షకులు ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంటారని విజయేంద్రప్రసాద్ సంచలన లీకులు చెప్పారు.
హీరో విలన్ ను కొడుతుంటే మరింతగా కొట్టాలని అనిపిస్తుందని.. కానీ ఇక్కడ హీరోలు ఇద్దరు కొట్టుకుంటే ఎవరికి సపోర్టు చేయకుండా కొట్టుకోవద్దని ప్రేక్షకులంతా కన్నీళ్లు పెట్టుకోవడం ఖాయమని..ఈ కథ నాకు తెలిసినా.. హీరోల పాత్రలు తెలిసినా.. ఫస్ట్ టైం నాకు ఏడుపు వచ్చిందని.. ఫస్ట్ టైం తాను అలాంటి ఎమోషన్ ఫీల్ అయ్యానని విజయేంద్రప్రసాద్ తెలిపారు.
విజయేంద్రప్రసాద్ చెప్పిన విషయాలో ఆర్ఆర్ఆర్ పై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. సినిమా ప్రేక్షకులకు గూస్ బాంబ్స్ తెప్పించడం ఖాయమన్న ప్రచారం ఇప్పుడు జోరందుకుంది.