RRR Dancer : ఆర్ ఆర్ ఆర్ మూవీలో గ్రూప్ డాన్సర్ గా చేసిన మణికంఠన్ అనే యువకుడు నేరానికి పాల్పడ్డాడు. అతడు ఒక వ్యక్తి ప్రాణాలు తీసే ప్రయత్నం చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మణికంఠన్ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళితే… తమిళనాడుకు చెందిన చెందిన మణికంఠన్ డాన్సర్. టాలీవుడ్ లో అవకాశాల కోసం హైదరాబాద్ లోనే ఉంటున్నాడు. చాలా సినిమాల్లో గ్రూప్ డాన్సర్ గా చేశాడు. ప్రముఖ కొరియోగ్రాఫర్స్ వద్ద పని చేశాడు.
ఇతడు బంజారాహిల్స్ లోని రాఘవ అపార్ట్మెంట్స్ లో స్నేహితుడితో పాటు నివాసం ఉంటున్నాడు. మణికంఠన్ తన స్నేహితుడితో మద్యం సేవించి కారిడార్ లో గోల చేస్తున్నాడట. పక్కన వాళ్ళకు ఇబ్బంది అవుతుంది, గొడవ చేయవద్దని వాచ్ మాన్ వారించాడట. ఈ క్రమంలో వాచ్ మాన్ తో మణికంఠన్ వాగ్వాదానికి దిగాడట. ఆవేశంలో మూడో అంతస్తు నుండి వాచ్ మాన్ ని తోసేశాడట.
ఎత్తున నుండి క్రిందపడిన వాచ్ మాన్ కి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు పోలీసులకు ఫోన్ చేసి, వాచ్ మాన్ ని ఆసుపత్రికి తరలించారట. మణికంఠన్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. వాచ్ మాన్ ప్రస్తుత కండిషన్ తెలియాల్సి ఉంది. మణికంఠన్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, అలియా భట్ లతో కలిసి సాంగ్ చేశారు.
ఆర్ ఆర్ ఆర్ మూవీ చివర్లో ‘కోడె’ అనే ఒక సాంగ్ వస్తుంది. దేశభక్తులు ఫోటోలు ప్రదర్శిస్తూ పంచ కట్టులో ఆర్ ఆర్ ఆర్ యూనిట్ ఈ చిత్రానికి డాన్స్ చేస్తారు. ఈ సాంగ్ లో నిందుతుడు మణికంఠన్ కూడా భాగమయ్యారు. మణికంఠన్ వ్యవహారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతుంది. మద్యం మత్తులో దారుణానానికి పాల్పడిన మణికంఠన్ పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.