Samantha Ruth Prabhu : ఇటీవల ఓ నిర్మాత సమంత ఉద్దేశిస్తూ సంచలన కామెంట్స్ చేశారు. ఆమె పని అయిపోయింది. వచ్చిన అవకాశాలు చేసుకుంటూ పోతుంది. సమంతకు ఇక స్టార్డం రాదు. ఆమెది ముసలి మొహం అంటూ దారుణ విమర్శలు చేశారు. అయితే సమంత స్టార్డం తగ్గడం కాదు కదా ఇంకా పైపైకి వెళుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆమె ఏకంగా ఇంటర్నేషనల్ బ్రాండ్ కి అంబాసిడర్ గా చేస్తున్నారు. దిగ్గజ శీతలపానీయాల సంస్థ పెప్సీ ప్రచారకర్తగా సమంతను నియమించుకుంది. భారత్ లో సమంత పెప్సీ నూతన బ్రాండ్ అంబాసిడర్. సమంత మీద ఓ క్రేజీ యాడ్ కూడా చేశారు.
పెప్సీ తన మీద రూపొందించిన యాడ్ వీడియో సమంత ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. పెప్సీ చిన్నాచితకా కంపెనీ కాదు. అందులోనూ నేషనల్ వైడ్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకున్నారంటే సాధారణ విషయం కాదు. సమంతకు ఫేమ్ లేకపోతే అంత పెద్ద సంస్థ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకోదు కదా. కాబట్టి సమంత ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇంకా లోకల్ నుండి నేషనల్ లెవెల్ కి చేరింది. ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ సమంతకు బాగా హెల్ప్ అయ్యింది.
సమంత ఆ ప్రాజెక్ట్ ఒప్పుకున్నప్పుడు కొందరు పెదవి విరిచారు. ది ఫ్యామిలీ మాన్ 2 ట్రైలర్ లో చూశాక సమంత బోల్డ్ సన్నివేశాలు చేశారని అర్థమైంది. పెళ్ళైన మహిళకు ఇలాంటి పాత్రలు అవసరమా అన్నట్లు మాట్లాడారు. సమంతను ది ఫ్యామిలీ మాన్ 2 నార్త్ ఆడియన్స్ కి దగ్గర చేసింది. ది ఫ్యామిలీ మాన్ 2 భారీ విజయం సాధించింది. ఈ క్రమంలో సమంత పేరు మారుమ్రోగింది. బాలీవుడ్ ప్రముఖ నటుడు మనోజ్ బాయ్ పాయ్ సమంత యాక్టింగ్, కమిట్మెంట్ గురించి ప్రత్యేకంగా కొనియాడారు.
ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ సమంతకు సిటాడెల్ ఆఫర్ తెచ్చిపెట్టింది. సిటాడెల్ ఇంటర్నేషనల్ సిరీస్. ఇండియన్ వెర్షన్ లో సమంత నటిస్తున్నారు. ఇంగ్లీష్ వర్షన్ లో ప్రియాంక చోప్రా నటించారు. ఏప్రిల్ 28 నుండి ప్రైమ్ లో సిటాడెల్ స్ట్రీమ్ అవుతుంది. సిటాడెల్ వరల్డ్ ప్రీమియర్ షో లండన్ లో జరిగింది . ఈ ఈవెంట్ కి సమంత ఆహ్వానించబడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో సమంత ఫేమ్ తగ్గలేదని బల్లగుద్ది చెప్పొచ్చు.
View this post on Instagram