
‘బాహుబలి’ సీరిసుల తర్వాత దర్శక దిగ్గజం తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ప్యాన్ వరల్డ్ మూవీగా ‘ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)’ తెరకెక్కుతోంది. ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రాంచరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. దీంతో ఈ మూవీ కోసం నందమూరి.. మెగా ఫ్యాన్స్ అత్రుతగా ఎదురుచూస్తున్నారు.
రాంచరణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ అభిమానులకు సర్ ప్రైజ్ చేసింది. ‘భీమ్ ఫర్ సీతరామరాజు’ పేరిట టీజర్ రిలీజ్ చేసింది. ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజైన ఈ టీజర్ యూట్యూబ్లోనే అత్యధిక వ్యూస్ సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది. రాజమౌళి స్థాయికి తగ్గకుండా టీజర్ ఆకట్టుకుంది.
రాంచరణ్ యాక్షన్ కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తోడవడంతో ఈ టీజర్ కు అనుహ్య స్పందన వచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ పుట్టిన రోజుకు ‘సీతరామరాజు ఫర్ భీమ్’ టీజర్ విడుదలవుతుందని నందమూరి ఫ్యాన్స్ భావించారు. అయితే కరోనా కారణంగా చిత్రబృందం టీజర్ రిలీజు చేయలేకపోతున్నట్లు ప్రకటించింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ నిరుత్సాహం చెందారు.
తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన వీడియోను రాజమౌళి విడుదల చేయగా పెద్దగా రెస్పాన్స్ రాలేదు. దీంతో చిత్రబృందం ఈనెల 22న ఎన్టీఆర్ టీజర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ టీజర్ కోసం ప్రేక్షకులు అత్రుతగా ఎదురుచూస్తున్నారు. వీరి అంచనాలను తగ్గట్టుగానే చిత్రబృందం కౌంట్ డౌన్ షూరు చేసింది.
‘భీమ్ ఫర్ సీతరామరాజు’ టీజర్లో రాంచరణ్ పోలీస్ గా కన్పించి అదరగొట్టాడు. దీంతో ఎన్టీఆర్ ను జక్కన్న ఎలా చూపించబోతున్నాడనే ఆసక్తి అందరిలో నెలకొంది. కొమురంభీం పాత్రను బందిపోటుగా చూపిస్తాడనే టాక్ విన్పిస్తోంది. చిత్రబృందం ప్రతీరోజు నాలుగు.. మూడు.. రెండు అంటూ కౌంట్ డౌన్ స్టాట్ చేసి అభిమానుల్లో మరింత అంచనాలను పెంచేస్తోంది. వీరి అంచనాలను దర్శకధీరుడు రాజమౌళి ఏమేరకు నిజం చేస్తాడో చూడాలి..!