https://oktelugu.com/

RRR Actor Ajay Devgn: తప్పు చేసి జైలు పాలైన RRR నటుడు అజయ్ దేవగన్

RRR Actor Ajay Devgn: బాలీవుడ్ లో టాప్ 5 స్టార్ హీరోల లిస్ట్ తీస్తే అందులో అజయ్ దేవగన్ గారు కచ్చితంగా ఉంటారు..మాస్ ప్రాంతాలలో ఈయనకి ఉన్న క్రేజ్ ఎవ్వరికి లేదు అనే చెప్పాలి..ఇటీవలే ఈయన రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ సెన్సషనల్ బ్లాక్ బస్టర్ #RRR లో రామ్ చరణ్ కి తండ్రిగా , స్వతంత్ర సమర యోధుడి పాత్రలో అద్భుతంగా నటించిన సంగతి మన అందరికి తెలిసిందే..సినిమాలో ఆయన పాత్ర కనిపించేది కాసేపే అయినా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 15, 2022 / 01:23 PM IST
    Follow us on

    RRR Actor Ajay Devgn: బాలీవుడ్ లో టాప్ 5 స్టార్ హీరోల లిస్ట్ తీస్తే అందులో అజయ్ దేవగన్ గారు కచ్చితంగా ఉంటారు..మాస్ ప్రాంతాలలో ఈయనకి ఉన్న క్రేజ్ ఎవ్వరికి లేదు అనే చెప్పాలి..ఇటీవలే ఈయన రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ సెన్సషనల్ బ్లాక్ బస్టర్ #RRR లో రామ్ చరణ్ కి తండ్రిగా , స్వతంత్ర సమర యోధుడి పాత్రలో అద్భుతంగా నటించిన సంగతి మన అందరికి తెలిసిందే..సినిమాలో ఆయన పాత్ర కనిపించేది కాసేపే అయినా ప్రేక్షుకులను ఒక్క రేంజ్ లో కనెక్ట్ చేసింది అనే చెప్పాలి..ప్రస్తుతం ఆయన దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం రన్ వే చిత్రం విడుదలకి దగ్గర్లో ఉంది..బిగ్ బీ అమితాబ్ బచ్చన్,రకుల్ ప్రీత్ సింగ్ మరియు ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ నెల 29 వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది..ఈ సందర్భంగా ఆయన ఈ చిత్ర ప్రొమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు..ఒక్క ఇంటర్వ్యూ లో ఆయన తన జీవితం లో చోటు చేసుకున్న కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకోగా అవి ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.

    RRR Actor Ajay Devgn

    ఈ ఇంటర్వ్యూ లో అజయ్ దేవగన్ తన కాలేజీ రోజుల గురించి మాట్లాడుతూ ‘ కాలేజీ రోజుల్లో నేను పెద్ద గూండాలాగా ప్రవర్తించేవాడిని..ఎప్పుడు గొడవల్లోనే ఉండేవాడిని, రెండు మూడు సార్లు జైలుకి కూడా వెళ్ళాను..మా నాన్న నన్ను ఎప్పుడు తిడుతూ ఉండేవాడు..ఒక్క రోజు ఆయనకీ తెలీకుండా ఆయన గన్ ని దొంగలించి గాల్లో పేల్చాను..దాని వల్ల నన్ను పోలీసులు అరెస్ట్ చేసారు..అలా తరుచు జరిగే గొడవల్లో అరెస్ట్ అయినా సందర్భాలు చాలానే ఉన్నాయి..కానీ ఆ రోజులు మేము బాగా ఎంజాయ్ చేసాము..నా జీవితం లో మోస్ట్ మెమొరబెల్ డేస్ అంటే అది కాలేజీ రోజులే’ అంటూ చెప్పుకొచ్చాడు..ఇది ఇలా ఉండగా అజయ్ దేవగన్ గతం లో కూడా రెండు సినిమాలకు దర్శకత్వం వహించాడు..2008 వ సంవత్సరం లో వచ్చిన ‘యూ మే ఔర్‌ హమ్‌’ మరియు 2016 వ సంవత్సరం లో వచ్చిన ‘శివాయ్’ అనే సినిమాలకు దర్శకత్వం వహించాడు..ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు..కానీ ’83 రన్ వే’ చిత్రం మాత్రం కచ్చితంగా విజయం సాధించే చిత్రం ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది, మరి అజయ్ దేవగన్ ఈ సినిమా తో దర్శకుడిగా ఈసారి అయినా విజయం సాధిస్తాడా లేదా అనేది తెలియాలి అంటే 29 వ తారీకు వరుకు వేచి చూడాల్సిందే.

    Also Read: RRR vs KGF 2 Box Office Collection: షాకింగ్ : అక్కడ ఆర్ఆర్ఆర్ కి 20 కోట్లు, కేజీఎప్ కి 45 కోట్లు !

    ఇది ఇలా ఉండగా హీరోగా అజయ్ దేవగన్ కెరీర్ ప్రస్తుతం మంచి ఊపులో ఉంది అనే చెప్పాలి..ఈయన హీరో గా వెండితెర మీద కనిపించిన ఆఖరి చిత్రం తానాజీ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది..బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా దాదాపుగా 330 కోట్ల రూపాయిల నెట్ ని వసూలు చేసింది..అంతతి సంచలన విజయం తర్వాత ఆయన మళ్ళీ పూర్తి స్థాయి హీరో గా మైథాన్ అనే సినిమా ద్వారా మన ముందుకి రాబోతున్నాడు..బోనీ కపూర్ న్రిమాతగా వ్యవహరించిన ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకొని విడుదలకి సిద్ధం గా ఉన్నది..ఈ సినిమా తో మరోసారి తమ హీరో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ తిరగరాయడం ఖాయం అని ఆయన అభిమానులు గట్టిగ నమ్ముతున్నారు..కేవలం సినిమాలు మాత్రం కాకుండా వెబ్ సిరీస్ లు కూడా వరుసగా చేస్తున్నాడు అజయ్ దేవగన్..ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన రుద్ర అనే వెబ్ సిరీస్ ఇటీవలే హాట్ స్టార్ లో విడుదల అయ్యి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ దక్కించుకున్నది.

    Also Read: ఇద్ద‌రితో ఎఫైర్ నడిపిస్తున్న యంగ్ హీరో.. ఒక‌రికి తెల‌వ‌కుండా మ‌రొక‌రితో.. చివరకు

    Tags