RRR 6th Day Collections: ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్స్ చూసి భారతీయ సినీ లోకమంతా.. సంతోషంతో సంభ్రమాశ్చర్యాలకు లోనవుతుంది, ఈ చిత్రం ఇంకెన్ని రికార్డులను నెలకొల్పి.. ఏ స్థాయి చరిత్రను సృష్టిస్తుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరోపక్క ‘ఆర్ఆర్ఆర్’ దెబ్బకు షేక్ అయిపోతున్న
బాక్సాఫీస్ ను చూసి ట్రేడ్ పండితుల సైతం కలెక్షన్ల ప్రవాహాన్ని అంచనా వేయలేక నోరెళ్ళబెట్టి చూస్తున్నారు.
ఒక తెలుగు సినిమాకి ఈ స్థాయి కలెక్షన్సా ? అంటూ బాలీవుడ్, హాలీవుడ్ సైతం ఆశ్చర్యపోతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్ రిపోర్ట్స్ ప్రకారం.. టోటల్ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే.. ఫస్ట్ డే 203.07 కోట్లు కలెక్ట్, సెకండ్ డే 135.50 కోట్లు, మూడో రోజు 275.81 కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే నాలుగో రోజు 315.58 కోట్లు కలెక్ట్ చేసింది. ఐదు రోజు 350.58 కోట్లు కలెక్ట్ చేసింది. మరి ఆరో రోజు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం.
Also Read: Yash KGF2 Censor Report: సెన్సార్ రిపోర్ట్ : `కేజీఎఫ్ 2′ రన్ టైమ్ ఎంతంటే.. ?
నైజాం 72.88 కోట్లు
సీడెడ్ 35.92 కోట్లు
ఉత్తరాంధ్ర 20.16 కోట్లు
ఈస్ట్ 10.79 కోట్లు
వెస్ట్ 09.48 కోట్లు
గుంటూరు 13.43 కోట్లు
కృష్ణా 10.27 కోట్లు
నెల్లూరు 06.11 కోట్లు
ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని ఐదు రోజులకు గానూ 179.04 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.
తమిళనాడు 23.37 కోట్లు
కేరళ 05.49 కోట్లు
కర్ణాటక 25.87 కోట్లు
హిందీ 60.10 కోట్లు
ఓవర్సీస్ 71.20 కోట్లు
రెస్ట్ 05.49 కోట్లు
మొత్తం ఆరు రోజులకు గానూ అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా 370.50 కోట్లు కలెక్ట్ చేసింది.
‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి తెలుగుతో పాటు అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.492 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.500 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఈ సినిమా ఆరు రోజులకు గానూ అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా 370.50 కోట్లు కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.669 కోట్లను కలెక్ట్ చేసింది. ఇప్పటికే ఈ చిత్రం టార్గెట్ రీచ్ అయినట్టే. ఓవరాల్ ఈ సినిమాకి ఇక నుంచి భారీ లాభాలు రాబోతున్నాయి.
Also Read: Shriya Saran shocking comments on NTR Charan: ఎన్టీఆర్ – చరణ్ పై శ్రియ షాకింగ్ కామెంట్స్