Rowdy Rohini: రోహిణి.. పరిచయం అక్కరలేని పేరు.. బుల్లితెర సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన రోహిణి తర్వాత బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. జబర్దస్త్‌లోనూ తన కామెడీ టైమింగ్, పంచులతో కమెడియన్‌గా రాణిస్తోంది. బుల్లితెరకే పరిమితం కాకుండా అటు వెండితెరపైనా సత్తా చాటుతోంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది. ఇటీవల రోహిణి తన కాలు సర్జరీ కోసం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. దీంతో కొన్ని నెలలుగా ఆమె తెరపై కనిపించలేదు. ప్రస్తుతం ఆమె కొంతమేరకు కోలుకుంది. దీంతో మళ్లీ స్క్రీన్‌పై కనిపేందకు రెడీ అయింది.
లవ్ బ్రేకప్ అయిందట..
తాజాగా రోహిణి ఓ షోలో మొట్టమొదటిసారి తన లవ్.. బ్రేకప్ గురించి చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు రోహిణికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా..? లేడా..? అనే విషయం చాలామందికి తెలియదు. ఇదే విషయం ఆమె రివీల్ చేసింది. తనకు ఒకప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడని, ఇప్పుడు బ్రేకప్ అయ్యిందని చెప్పుకొచ్చింది. అతనితో వచ్చిన కొన్ని విభేదాల వల్ల బ్రేకప్ అయ్యానని, దాంతో చాలా నరకాన్ని అనుభవించానని ఆమె పేర్కొంది. అప్పుడు తానెంతో డిప్రెషన్‌లోకి వెళ్లానని గుర్తుచేసుకుంది. ఆ సమయంలో తన ఫ్రెండ్స్ ఎంతగానో సపోర్ట్‌గా నిలిచారని చెప్పింది.
ఇద్దరితో ప్రేమాయణం..
బాయ్ ఫ్రెండ్ తనతోపాటు.. మరో అమ్మాయితో కూడా ప్రేమాయణం నెరిపాడని రోహణి చెప్పింది. ఈ విషయం తర్వాత తెలుసుకుని అడిగితే నిజమేనన్నాడట. ఇద్దరుతో ఏంట్రా అని.. ముందునుంచే ఉంటే చెప్పాలి కదా అని నిలదీసిందట. ఎంతో నమ్మకంతో ప్రేమిస్తే.. చీట్ చేయడంతో అతడికి బ్రేకప్ చెప్పినట్లు వివరించింది. అప్పటి నుంచి ఇక ఎవరినీ ప్రేమించలేదని వెల్లడించింది.
ఫ్రెండ్స్ సపోర్టుతో..
లవ్ బ్రేకప్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లిన తనకు ఫ్రెండ్స్ సపోర్టుగా నిలిచారని తెలిపింది. వారు అన్న మాటలను మరోసారి గుర్తుచేసుకుంది. ‘నా ఫ్రెండ్స్ అందరూ అసలు వాడెవడు.. నీ కాలి గోటికి కూడా సరిపోడు అంటూ నాకు ధైర్యాన్ని ఇచ్చేవారు. అప్పుడు, వీడు ఒక ఆఫ్ట్రాల్ గాడు.. వీడి గురించి ఇంతలా ఆలోచించడం ఏంటని నన్ను నేను ప్రశ్నించుకున్నా.. అలా వారి సపోర్ట్‌తోనే ఆ కష్ట సమయం నుంచి బయటపడ్డాను.’ అని రోహిణి తెలిపింది.
బాయి ఫ్రెండ్ ఎవరా అని ఆరా..
తన బాయ్‌ఫ్రెండ్, లవ్, బ్రేకప్ గురించి వివరంగా చెప్పిన రోహిణి అతడి పేరు మాత్రం రివీల్ చేయలేదు. దీంతో రోహిణిని ప్రేమించి వదిలేసిన అబ్బాయి ఎవరని నెట్టింట తన అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. రోహిణి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. తనకు కాబోయేవాడు కూడా ఎలా ఉండాలో చెప్పింది. ఇండస్ట్రీలో వాడిని పెళ్లి చేసుకోనని క్లారిటీ ఇచ్చింది. తనను బాగా చూసుకునేవాడు కావాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.