Rowdy Janardhan ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న నటుడు విజయ్ దేవరకొండ… ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి అతనికి వరుసగా ప్లాప్ సినిమాలు రావడంతో అతని అభిమానులు చాలా వరకు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం వచ్చిన ‘కింగ్ డమ్’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తాడని అందరు అనుకున్నప్పటికి ఆయన ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో అతను చాలా వరకు డీలా పడిపోయాడు… ఇక ప్రస్తుతం ‘రౌడీ జనార్ధన్’ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ ప్రేక్షకులను కొంతవరకు ఆకట్టుకుంది. అది చూసిన ప్రతి ఒక్కరు విజయ్ దేవరకొండ బోల్డ్ డైలాగులతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడనే విషయమైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది.
విజయ్ దేవరకొండ నానిని చూసి ఆయన ఏ సినిమాలను చేస్తున్నాడో తను కూడా అదే టైప్ సినిమాలను చేస్తున్నాడు. అదే జానర్ లో సినిమాలను చేయాలని చూస్తున్నాడు అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు. కారణం ఏంటి అంటే ప్రస్తుతం నానికి విజయ్ కి మధ్య సినిమాలపరంగా పోటీ ఉంది.
ఇద్దరిలో ఎవరో ఒకరు టైర్ వన్ హీరోగా మారే అవకాశాలైతే ఉన్నాయి. మరి ఇద్దరిలో ఆ హీరో ఎవరు అనేదే తెలియడం లేదు. నిజానికి నాని దసర సినిమా ముందు వరకు అతనికి 100 కోట్లు మార్కెట్ అయితే లేదు…కానీ విజయ్ దేవరకొండ ‘గీతగోవిందం’ సినిమాతోనే 100 కోట్లు మార్కును టచ్ చేశాడు.
ఆ సినిమా తర్వాత తనకి సక్సెస్ లేకపోవడంతో చాలా వరకు వెనుకబడిపోయాడు. దాంతో నాని కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలను ఎంచుకుంటూ వాటిని సక్సెస్ ఫుట్ గా చేసుకుంటూ ముందుకు దూసుకు వచ్చాడు… ప్రస్తుతం ఇద్దరిలో పోటీ తీవ్రతరంగా ఉంది. వీళ్లలో ఎవరు టాప్ లెవెల్ కి వెళ్తారు అనేది తెలియాల్సి ఉంది…