https://oktelugu.com/

Rowdy Boys: బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేసిన ‘రౌడీ బాయ్స్‌’ ఓటీటీలో హిట్ అవుతారా ?

Rowdy Boys: ‘దిల్‌’ రాజు తమ్ముడు శిరీష్‌ కుమారుడు ఆశిష్‌ ‘రౌడీ బాయ్స్‌’ అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీన ఈ సినిమా విడుదల అయింది. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా బాగా చేశారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఆడియో ఫంక్షన్ కి చరణ్ వచ్చాడు. ప్రభాస్ కూడా సపోర్ట్ చేశాడు. అయినా సినిమా హిట్ కాలేదు. […]

Written By:
  • Shiva
  • , Updated On : March 1, 2022 / 03:42 PM IST
    Follow us on

    Rowdy Boys: ‘దిల్‌’ రాజు తమ్ముడు శిరీష్‌ కుమారుడు ఆశిష్‌ ‘రౌడీ బాయ్స్‌’ అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీన ఈ సినిమా విడుదల అయింది. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా బాగా చేశారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఆడియో ఫంక్షన్ కి చరణ్ వచ్చాడు. ప్రభాస్ కూడా సపోర్ట్ చేశాడు.

    Rowdy Boys Movie

    అయినా సినిమా హిట్ కాలేదు. దిల్ రాజు తన తమ్ముడు కొడుకు కోసం స్టార్ హీరోలను పట్టుకొచ్చినా ఉపయోగం లేకుండా పోయింది. దిల్ రాజు సహజంగా వేరే హీరోల కథలపైనే సంవత్సరాలు పాటు వర్క్ చేయించి సినిమాలు తీస్తాడు. మరి తన తమ్ముడు కుమారుడి కోసం, ఇక దిల్ రాజు ఎంతగా కసరత్తులు చేసి ఉంటాడు ? అందుకే, ఏకంగా మూడు ఏళ్ళు స్క్రిప్ట్ వర్క్ చేయించి ఈ సినిమాని తీసుకువచ్చాడు.

    Also Read:  పెళ్లికి సిద్ధం అయిన హీరోయిన్‌ తాప్సీ

    అయినా ముందు నుంచి దిల్ రాజుకి ఈ సినిమా విషయంలో ఎక్కడో భయం ఉందనుకుంటా. ప్రమోషన్స్ లో కూడా సినిమా పై ఓవర్ గా ఎక్కడా మాట్లాడలేదు. ఆ మధ్య పెట్టిన ప్రెస్ మీట్ లో కూడా ‘దిల్‌’ రాజు సినిమా గురించి డౌట్ గానే మాట్లాడాడు. అందుకే ఎక్కడో ఈ సినిమా పై అపనమ్మకం క్రియేట్ అయింది ప్రేక్షకుల్లో కూడా. ఏది ఏమైనా సినిమా మొత్తానికి రిలీజ్ అయి ప్లాప్ అయ్యింది.

    ఇక తాజాగా రౌడీ బాయ్స్ ఓటీటీ రిలీజ్‌కు డేట్ ఫిక్స్ అయింది. నిర్మాత దిల్ రాజు తమ్ముడు కొడుకు ఆశిష్ రెడ్డి హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా రూపొందిన ఈ మూవీకి శ్రీహ‌ర్ష కొనుగంటి దర్శకత్వం వహించాడు. సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న విడుద‌లై నష్టాలు తెచ్చి పెట్టింది.

    కాగా, ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ లో ప్లాట్‌ఫామ్‌ జీ 5లో మార్చి 11 నుంచి స్ట్రీమింగ్ కాబోతుందని మేకర్స్ ప్రటించారు. మరి బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ ‘రౌడీ బాయ్స్‌’ ఓటీటీ హిట్ అవుతారా ? చూడాలి. అన్నట్టు ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు.

    Also Read:  ‘పునీత్ రాజ్ కుమార్’కు నివాళి గా నింగిలోకి ఉపగ్రహం

    Tags