https://oktelugu.com/

Suma Adda: తల్లి సుమ ముందే హీరోయిన్ తో ఘాటు రొమాన్స్ చేసిన కొడుకు రోషన్… చూడలేక కళ్ళు మూసుకున్న స్టార్ యాంకర్

హీరోయిన్ మానస చౌదరితో మనోడు ముద్దు సన్నివేశాల్లో నటించాడు. ట్రైలర్ లోనే నాలుగైదు ముద్దు సన్నివేశాలు ఉన్నాయి. ఇక సినిమాలో ఏ రేంజ్ లో ఉంటాయో అనే సందేహం కలుగుతుంది.

Written By:
  • NARESH
  • , Updated On : December 19, 2023 / 06:32 PM IST

    Suma Adda

    Follow us on

    Suma Adda: ఈ మధ్య సినిమాల్లో రొమాన్స్ డోస్ పరిమితికి మించి ఉంటుంది. ముద్దు సీన్స్ లో రెచ్చిపోతున్నారు హీరోలు హీరోయిన్స్. యానిమల్ మూవీలో రష్మిక మందాన-రన్బీర్ కపూర్ మొహమాటం లేకుండా పెదాలు జుర్రేశాను. లెక్కకు మించిన లిప్ లాక్ సన్నివేశాల్లో నటించారు. రష్మిక గతంలో లిప్ లాక్ సీన్స్ చేసింది కానీ… ఈ రేంజ్ లో కాదు. ఇక డెబ్యూ హీరోలు కూడా తగ్గడం లేదు. స్టార్ యాంకర్ సుమ కనకాల కొడుకు రోషన్ బబుల్ గమ్ మూవీతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇటీవల భారీగా ట్రైలర్ లాంచ్ చేశారు.

    హీరోయిన్ మానస చౌదరితో మనోడు ముద్దు సన్నివేశాల్లో నటించాడు. ట్రైలర్ లోనే నాలుగైదు ముద్దు సన్నివేశాలు ఉన్నాయి. ఇక సినిమాలో ఏ రేంజ్ లో ఉంటాయో అనే సందేహం కలుగుతుంది. మిడిల్ క్లాస్ అబ్బాయికి హై క్లాస్ అమ్మాయి మధ్య నడిచే లవ్ డ్రామా ఇది. ఈ జనరేషన్ యంగ్ మెంటాలిటీ ఆధారంగా తెరకెక్కించారు. కొడుకును హీరోగా నిలబెట్టాలని సుమ గట్టిగా ప్రయత్నం చేస్తుంది. బాగా ప్రమోట్ చేస్తున్నారు.

    బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలేలో బబుల్ గమ్ ట్రైలర్ ప్రదర్శించారు. సుమ, రోషన్, మానస చౌదరి… నాగార్జునతో పాటు వేదిక మీద సందడి చేశారు. తాజాగా సుమ అడ్డాలో బబుల్ గమ్ టీమ్ సందడి చేశారు. రోషన్, మానస, రాజీవ్ కనకాల, దర్శకుడు రవికాంత్ పేరెపు హాజరయ్యారు. ఇక సుమ భర్త మీద కూడా తనదైన పంచులు వేసింది. అయితే రోషన్, మానస్ మీద ఉప్పెన చిత్రంలోని ‘జలపాతం నువ్వు’ సాంగ్ ప్లే చేశారు.

    పడవలో కూర్చున్న రోషన్ పక్కనే ఉన్న మానస్ తో రొమాన్స్ స్టార్ట్ చేశాడు. అది చూడలేక సుమ ముఖాన పైట కొంగు కప్పుకుంది. కాసేపటి తర్వాత లాభం లేదని కట్ చెప్పింది. నటించామన్నావుగా… అని రోషన్ తల్లితో అన్నాడు. అందుకే కట్ చెప్పానని సుమ అన్నారు. తల్లి ముందే రోషన్ రెచ్చిపోయి రొమాన్స్ చేయడం చర్చకు దారి తీసింది. సుమ అడ్డా ప్రోమో వైరల్ అవుతుంది. బబుల్ గమ్ మూవీ డిసెంబర్ 29న విడుదల కానుంది.