Romantic Movie Collection: డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎలాగైనా తన కొడుకును హీరోగా నిలబెట్టాలని స్వయంగా కథ, మాటలు, స్క్రీన్ ప్లే రాసి నిర్మించిన సినిమా ‘రొమాంటిక్’. సినిమాకి అయితే నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమాలో మ్యాటర్ లేదని.. ఇంట్రెస్ట్ కలిగించే కథ లేదని.. రివ్యూస్ కూడా బాగా నెగిటివ్ గా వచ్చాయి. అయితే, బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ సినిమాకు ఏవరేజ్ వసూళ్లు వస్తున్నాయి. సినిమా టాక్ కి కలెక్షన్స్ కి సంబంధం లేకుండా సినిమా బాగానే నడుస్తోంది.

మరి ఆకాష్ – కేతిక జంటగా అనిల్ పాదూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కలెక్షన్స్ చాలా ఏరియాల్లో ఇంకా స్టడీగా ఉన్నాయా ? లేక డిజాస్టర్ కి పడిపోయాయా ? చూద్దాం.
ఏరియాల వారీగా ఫస్ట్ మూడు రోజుల కలెక్షన్స్ !
నైజాం 1.09 కోట్లు,
సీడెడ్ 0.58 కోట్లు,
ఉత్తరాంధ్ర 0.36
గుంటూరు 0.26 కోట్లు,
ఈస్ట్ 0.23 కోట్లు,
వెస్ట్ 0.17 కోట్లు,
కృష్ణా 0.21 కోట్లు,
నెల్లూరు 0.15 కోట్లు,
తెలంగాణ & ఏపీలో ఫస్ట్ మూడు రోజుల కలెక్షన్ల షేర్ : రూ. 3.05 కోట్లు,
ఇక ‘రెస్ట్ ఆఫ్ ఇండియా’ మరియు ‘ఓవర్సీస్’ కలెక్షన్స్ విషయానికి వస్తే..
రెస్ట్ ఆఫ్ ఇండియా కలెక్షన్స్ : 0.08 కోట్లు,
ఓవర్సీస్ కలెక్షన్స్ : 0.08 కోట్లు,
ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు ఇప్పటివరకు వచ్చిన మొత్తం కలెక్షన్స్ 3.21 కోట్లు.
నిజానికి ఈ సినిమాకు ఈ మాత్రం అయినా కలెక్షన్స్ వచ్చాయి అంటే.. అందుకు కారణం పూరినే. పూరి ఈ సినిమాకు రచయిత కావడంతో ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా ఎమోషనల్ స్టోరీలో బోల్డ్ సీన్స్ పెట్టి మాస్ ఆడియన్స్ ను పూరి బాగా ఆకట్టుకున్నాడు. దీనికితోడు సినిమాలోని మాస్ ఎలిమెంట్స్ చాలా బాగా కుదిరాయి.
అందుకే కనీసం భారీ కలెక్షన్స్ ను రాబట్టలేకపోయినా ఓ స్థాయి వసూళ్లను మాత్రం ఈ చిత్రం బాగానే వసూళ్లు చేస్తోంది. కాకపోతే, హిట్ కోసం ఆకాష్ కి నిరాశే మిగిలింది.
Also Read: ‘రొమాంటిక్’ మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?