Naga Babu And Roja Remuneration: బుల్లితెరపై కామెడీ షో తో ప్రభంజనం సృష్టించిన ‘జబర్దస్త్’ గురించి తెలియని వారుండరు. ఈ షో ద్వారా చాలా మంది నటులు ఫైనాన్షియల్ గా ఎదిగారు. ఈ షో కు వచ్చిన తరువాత చాలా మంది సినిమాల్లో నటిస్తున్నారు. మరికొంతమంది ఇతర చానెళ్లలో ప్రముకంగా కొనసాగుతున్నారు. అయితే ఇటీవల జబర్దస్త్ పై అనేక ఆరోపణలు వస్తున్నాయి ఈ షో నుంచి ఒక్కొక్కరు బయటకు వెళ్లడంపై కిర్రాక్ ఆర్పీ సంచలన కామెంట్స్ చేశారు. ఈ షో ను నిర్వహిస్తున్న యాజమాన్యం రాజకీయాల వల్లే అందరూ వెళ్లిపోతున్నారని అన్నారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు సరికావని మిగతా కమెడియలన్లతో పాటు మాజీ మేనేజర్ ఎడుకొండలు రిప్లై ఇచ్చారు. అంతేకాకుండా జబర్దస్త్ కు జడ్జిలుగా వ్యవహరించిన నాగబాబు కంటే రోజాకు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చారని కిర్రాక్ ఆర్పీ హాట్ కామెంట్స్ చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఏడుకొండలు సమాధానం ఏంటంటే..?
జబర్దస్త్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ షో తరువాత మిగతా చానెళ్లు కూడా కామెడీ షోలకు ప్రిఫరెన్స్ ఇస్తున్నాయి. అయితే జబర్దస్త్ లో నటించిన వారికి బంఫర్ ఆపర్స్ ఇస్తూ వారిని తమ షో లకు రప్పిస్తున్నారు. ఈ నేపత్యంలో కిర్రాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలు టీవీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై హైపర్ ఆది లాంటి నటులు స్పందించారు. కిర్రాక్ ఆర్పీకి జబర్దస్త్ లైఫ్ ఇచ్చిందని, ఆయన అలా మట్లాడడం కరెక్ట్ కాదని అన్నారు. అంతేకాకుండా మాజీ మేనేజర్ ఏడుకొండలు సైతం రిప్లై ఇచ్చారు.
Also Read: Nayanthara- Vignesh Shivan: నయనతార – విగ్నేష్ దంపతులపై నెట్ ఫ్లిక్స్ ఫైర్.. భారీ డీల్ క్యాన్సిల్
ఏడుకొండలు పేరు అప్పట్లో పాపులర్ అయింది. నటులు చేసే స్కిట్లలోనూ ఆయన పేరు ప్రస్తావించేవారు. ఆయన మమ్మల్ని ఎంతో బాగా చూసుకుంటున్నారని అనేవారు. అయితే తాజాగా కిర్రాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలతో ఆయన తెరముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆయన కూడా ఈ ప్రొగ్రాంలో లేరు. దీంతో కిర్రాక్ ఆర్పీ చేసిన కామెంట్లలో ఏడుకొండలు కూడా రాజకీయాల కారణంగానే బయటికి వచ్చారని అన్నారు. కానీ ఈ వ్యాఖ్యాలపై ఏడుకొండలు వివరణ ఇచ్చారు. జబర్దస్త్ లో ఎలాంటి రాజకీయాలు లేవన్నారు. ప్రతిభను బట్టి అవకాశాలిచ్చారని అన్నారు. చాలా మంది తమ సొంత కారణాలతోనే ఈ షో నుంచి బయటకు వచ్చారని తెలిపారు.
ఇక నాగబాబు రెమ్యూరేషన్ పై కూడా ఏడుకొండలు స్పందించారు. నాగబాబు కంటే రోజాకు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చింది వాస్తవమేనన్నారు. అయితే రోజా అప్పటికే స్టార్ హీరోయిన్. అమె సినిమాల నుంచి టీవీ షో కు వచ్చారు. ఆమె మార్కెట్ రేటును బట్టి రెమ్యూనరేషన్ పెంచాల్సి వచ్చిందని తెలిపారు. ఇక ఆమె కూడా రాజకీయాల కారణంగానే బయటకు వెళ్లిందని అంటున్నారు. కానీ ఆమె పొలిటికల్ లీడర్ అన్న విషయం అందరికీ తెలుసన్నారు. మంత్రి హోదాలో టీవీ కార్యక్రమాల్లో ఉండకూడదనే షో నుంచి బయటికి వచ్చినట్లు తెలిపారు. కిర్రాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు.
Also Read:Rashmika Mandanna: ఫొటో గ్యాలరీ: జారిపోతున్న డ్రెస్ తో తెగ ఇబ్బంది పడ్డ రష్మిక మందన్నా?