
Jabardasth: బుల్లితెరపై సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది జబర్దస్త్.. ఏళ్లతరబడి కొనసాగుతున్న ఈ షో.. తెలుగు స్మాల్ స్క్రీన్ పై ట్రేడ్ మార్క్ నమోదు చేసిందనే చెప్పాలి. అయితే.. ఈ కార్యక్రమం ఎంత పేరు సంపాదించిందో.. ఇందులో పాల్గొన్నవారు కూడా.. అంతే ఫేమస్ అయ్యారు. వీరిలో జడ్జీలది ముందు వరసే. షో మొదటి నుంచి.. గతేడాది వరకు నాగబాబు, రోజా అప్రతిహతంగా రన్ చేశారు. వారి ప్లేసులో ప్రేక్షకులు మరొకరిని ఊహించుకోలేనట్టుగా కొనసాగారు.
కానీ.. ప్రతి ప్రయాణానికీ ముంగింపు ఉంటుందన్నట్టుగా.. జబర్దస్త్(Jabardasth) నుంచి నాగబాబు వెళ్లిపోయారు. అప్పటి నుంచి జడ్టీల విషయం మల్లెమాల యూనిట్ ను వేధిస్తూనే ఉంది. ఇప్పటి వరకూ ఎంతోమంది జడ్జీలు మారారు. కొందరు రావడం.. కొంతకాలం ఉండిపోవడం జరుగుతూ ఉంది. దీంతో.. చాలాకాలం రోజానే జబర్దస్త్ ను లాక్కొచ్చారు.
అయితే.. కొంత కాలంగా రోజా కూడా తరచూ కనిపించకుండా పోతున్నారు. ఏళ్లతరబడి ఏనాడూ.. డేట్స్ మిస్ చేయని రోజా.. ఈ మధ్య తరచూ డుమ్మా కొడుతున్నారు. ఆ మధ్య అనారోగ్యంతో చాలా కాలం దూరంగా ఉన్నారు. తర్వాత.. మళ్లీ తెరపైకి వచ్చిన రోజా.. తాజాగా మళ్లీ మిస్సయ్యారు. అయితే.. రోజా ఆబ్సెంట్ అయినప్పుడల్లా అ ప్లేస్ ను ఇంద్రజ భర్తీ చేస్తున్నారు.
నాగబాబు ప్లేసును మనో భర్తీ చేశారు. ఆయన కంటిన్యూ అవుతున్నారు. ఇక, రోజా స్థానాన్ని ఇంద్రజ ఫిల్ చేస్తోంది. గతంలో.. రోజా మిస్ అయినపుడు ఒక్కో వారం ఒక్కొక్కరిని జడ్జిలుగా తీసుకొచ్చి కవర్ చేశారు. అయితే.. ఇప్పుడు ఇంద్రజ మల్లెమాలలో మెంబర్ అయిపోయారు. ఆమె అందం, అభినయంతోపాటు జడ్జిమెంట్‌తోనూ ఆకట్టుకుంటున్నారు. దీంతో.. పర్మనెంట్ జడ్జిగా మారిపోతున్నారు. రోజా రాజకీయంగా బిజీ అవుతున్న నేపథ్యంలో.. ఇంద్రజ పూర్తిస్షాయిగా ఫిక్స్ అయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి.