https://oktelugu.com/

Bigg Boss Telugu 8: గ్రూప్ గేమ్స్ ఆడకు అంటూ రోహిణి కి వార్నింగ్ ఇచ్చిన తల్లి..కొందరితో జాగ్రత్తగా ఉండు అంటూ సూచనలు!

రోహిణి అమ్మ వచ్చే ముందు ఒక చిన్న పిల్లాడు కన్ఫెషన్ రూమ్ లో నుండి బయటకి వస్తాడు. ఆ బుడ్డోడిని చూడగానే హౌస్ మేట్స్ అందరూ ముందుగా ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత రోహిణి అక్కడికి వచ్చి, బుడ్డోడిని పైకి ఎత్తుకొని మా అన్న కొడుకు అని అందరికీ పరిచయం చేస్తుంది.

Written By:
  • Vicky
  • , Updated On : November 13, 2024 / 08:09 AM IST

    Bigg Boss Telugu 8

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ వారం బిగ్ బాస్ లో ఫ్యామిలీ వీక్ నడుస్తున్న నేపథ్యం లో నిన్నటి ఎపిసోడ్ లో రోహిణి వాళ్ళ అమ్మగారు హౌస్ లోకి అడుగుపెట్టి సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈమెకు ముందు నబీల్ అమ్మగారు వచ్చి వెళ్తారు. రోహిణి అమ్మ వచ్చే ముందు ఒక చిన్న పిల్లాడు కన్ఫెషన్ రూమ్ లో నుండి బయటకి వస్తాడు. ఆ బుడ్డోడిని చూడగానే హౌస్ మేట్స్ అందరూ ముందుగా ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత రోహిణి అక్కడికి వచ్చి, బుడ్డోడిని పైకి ఎత్తుకొని మా అన్న కొడుకు అని అందరికీ పరిచయం చేస్తుంది. నాన్నమ్మ ఎక్కడ రా అని రోహిణి అడగగా, అప్పుడే ఆమె మెయిన్ డోర్ నుండి లోపలకు వస్తుంది. రోహిణి ఆమెని చూడగానే చాలా ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత ఆమె లోపలకు వచ్చిన తర్వాత హౌస్ మేట్స్ అందరితో బాగా కలిసిపోయి మాట్లాడుతుంది. ముఖ్యంగా గౌతమ్ ని తన అల్లుడు అంటూ రోహిణి తరహాలో కామెడీ గా మాట్లాడుతుంది.

    ఇక బుడ్డోడితో అయితే హౌస్ మేట్స్ అందరూ బాగా ఆడుకుంటారు. అయితే మనకి ప్రోమో లో చూపించిన కొన్ని షాట్స్ మెయిన్ ఎపిసోడ్ లో ఎత్తేసారు. అవినాష్ బుడ్డోడిని ఎత్తుకొని తేజ తో కలిసి గార్డెన్ ప్రాంతంలోకి వస్తారు. అప్పుడు అవినాష్ బుడ్డోడితో మాట్లాడుతూ ‘ఇది స్విమ్మింగ్ పూల్..వీడు బ్లడీ ఫూల్’ అని తేజ వైపు చూపిస్తూ అంటాడు. ఇది మెయిన్ ఎపిసోడ్ లో లేపేశారు. వేసి ఉండుంటే ఎపిసోడ్ ఇంకా చాలా ఫన్నీ గా ఉండేది. ఫన్ తో పాటు కొంచెం ఎమోషనల్ గా కూడా అనిపించింది. విష్ణు ప్రియ బయట ఉన్నప్పుడు కూడా రోహిణి కుటుంబంతో మంచి సాన్నిహిత్యం ఉంది అనుకుంట. అందుకే ఆమె విష్ణు ని చూసిన వెంటనే ‘అమ్మ లేదని బాధపడకు..నేను కూడా మీ అమ్మ లాగానే అని అనుకో’ అంటుంది. నాకు తెలుసు అంటూ విష్ణు ప్రియ ఎమోషనల్ గా రోహిణి వాళ్ళ అమ్మగారిని హత్తుకుంటుంది.

    ఇదంతా జరిగిన తర్వాత రోహిణి అమ్మగారు కాసేపు ఆమెతో ఏకాంతంగా చర్చిస్తారు. ఈ చర్చలో ఆమె మాట్లాడుతూ రోహిణి కి పలు కీలకమైన సూచనలు చేసింది. రోహిణి కచ్చితంగా గ్రూప్ గేమ్ ఆడుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఈమె గ్రూప్ గేమ్ ఆడుతూ, నిఖిల్ బ్యాచ్ ని గ్రూప్ గేమ్ అని అంటుంది. దీని గురించి రోహిణి తల్లి వార్నింగ్ ఇస్తూ ‘మీ హౌస్ లో క్లాన్ గేమ్స్ అయిపోయాయి..ఇక నుండైనా సొంతంగా గేమ్స్ ఆడు’ అని అంటుంది. ఆ తర్వాత నువ్వు స్నేహితులు అనుకున్నవాళ్ళని మరీ గుడ్డిగా నమ్మకు, నీ వెనుక చేరి వాళ్ళు చాలా చేస్తున్నారు అంటూ విష్ణు ప్రియ ని ఉద్దేశించి పరోక్షంగా కామెంట్స్ చేస్తుంది. హౌస్ లోకి మీరు వచ్చింది కప్పు కొట్టడానికి, అంతే కానీ మేము ఎంటెర్టైనెర్స్, మాకు కప్పు రాదు అని అనుకోకండి, అది చాలా తప్పు అని సూచనలు ఇస్తుంది.