Rocking Rakesh Sujatha Daughter: జబర్దస్త్(JABARDASTH) ఫేమ్ రాకింగ్ రాకేష్, సుజాత తమ కూతురికి అన్నప్రాసన వేడుక నిర్వహించారు. ఈ బుల్లితెర జంట ప్రేమ వివాహం చేసుకోగా గత ఏడాది తల్లిదండ్రులు అయ్యారు. రాకింగ్ రాకేష్ కూతురు క్యూట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
జబర్దస్త్ సీనియర్ కమెడియన్స్ లో రాకింగ్ రాకేష్(ROCKING RAKESH) ఒకడు. ఆయన జోర్దార్ సుజాత(SUJATHA)ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి 2024 అక్టోబర్ లో పండండి ఆడబిడ్డ పుట్టింది. ఈ విషయాన్ని రాకింగ్ రాకేష్ దంపతులు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. నవంబర్ నెలలో నామకరణం చేశారు. వరంగల్లులో గల భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఈ వేడుక నిర్వహించారు. పాపకు ఖ్యాతిక అని నామకరణం చేశారు.
తాజాగా అన్నప్రాసన వేడుక నిర్వహించారు. ఖ్యాతికను ఉద్దేశిస్తూ మా పాప తొలిపండగ అని క్యాప్షన్ ఇస్తూ… అన్నప్రాసన వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో రాకేష్ దంపతులు పంచుకున్నారు. రాకింగ్ రాకేష్, సుజాత సాంప్రదాయ పట్టు వస్త్రాల్లో కనిపించారు. అలాగే పాపకు పట్టు బట్టల్లో అలంకరించారు. ఖ్యాతిక అన్నప్రాసన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాప చాలా క్యూట్ గా ఉందని నెటిజెన్స్, అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Rocking Rakesh : ఆ డైరెక్టర్ చేసిన మోసం వల్లే సుజాతని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది : రాకింగ్ రాకేష్
రాకింగ్ రాకేష్ ని సుజాత ప్రేమ వివాహం చేసుకుంది. రాకింగ్ రాకేష్ తమ్ముడికి ఎప్పుడో వివాహం కాగా, అతడు మాత్రం పెళ్ళికి ససేమిరా ఒప్పుకోవడం లేదట. రాకేష్ కి వివాహం ఎలా చేయాలా అని పేరెంట్స్ మదనపడుతున్న సమయంలో.. అతని జీవితంలోకి సుజాత వచ్చిందట. ఈ విషయాన్ని రాకేష్ తల్లి స్వయంగా వెల్లడించింది. రాకేష్ కి అసలు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదు. సుజాత కారణంగానే మావాడు ఓ ఇంటివాడు అయ్యాడని ఆమె అన్నారు.
జోర్దార్ వార్తలతో ఫేమస్ అయిన సుజాత బిగ్ బాస్ సీజన్ 4లో ఛాన్స్ వచ్చింది. హోస్ట్ నాగార్జునను బిట్టు అని పిలుస్తూ ఫేమస్ అయ్యింది. అయితే సుజాత పెద్దగా రాణించలేదు. అనంతరం సుజాత జబర్దస్త్ లోకి వచ్చింది. రాకింగ్ రాకేష్ టీమ్ లో స్కిట్స్ చేసేది. ఈ క్రమంలో సుజాతతో రాకింగ్ రాకేష్ కి సాన్నిహిత్యం ఏర్పడింది. తిరుమల శ్రీవారి సన్నిధిలో వీరి వివాహం జరిగింది. మాజీ మంత్రి రోజా వీరి వివాహం దగ్గరుండి చేసింది. రాకింగ్ రాకేష్ జబర్దస్త్ లో రాణిస్తున్నాడు. సుజాత కొన్ని టెలివిజన్ షోలలో సందడి చేస్తుంది.
View this post on Instagram