Rocking Rakesh- Jordar Sujatha: పెళ్లి ఓల్డ్ ఫ్యాషనైపోయింది. నచ్చితే కలిసి బ్రతకడం, ఇబ్బంది అనిపిస్తే ఈజీగా విడిపోవడం ట్రెండ్ గా మారింది. ఒకవేళ పెళ్లి చేసుకునే ఆలోచన ఉన్నా కొన్నాళ్ళు సహజీవనం చేస్తున్నారు. అనేక మంది సెలబ్రిటీలు ఇప్పుడిదే చేస్తున్నారు. తాజాగా రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత సహజీవనం చేస్తున్నారన్న వార్త గుప్పుమంది. వీరిద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారనేది తాజా వార్త. బిగ్ బాస్ షోలో పాల్గొన్న సుజాతకు బుల్లితెర ఆఫర్స్ పెరిగాయి. ఆమె జబర్దస్త్ షో కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో రాకింగ్ రాకేష్ సుజాతకు దగ్గరయ్యారు.

కొన్నాళ్లుగా వీరిద్దరూ సన్నిహితంగా ఉంటున్నారు. కామెడీ షోస్ వేదికగా ఒకరిపై మరొకరు ప్రేమ కురిపిస్తున్నారు. రాకింగ్ రాకేష్ ని ఇష్టపడుతున్నానని సుజాత పలు సందర్భాల్లో తెలియజేశారు. మొదట్లో రష్మీ-సుడిగాలి సుధీర్, ఇమ్మానుయేల్-వర్ష తరహా ఉత్తుత్తి ప్రేమ అనుకున్నారు. అయితే ఇద్దరూ కలిసి విందులు విహారాల్లో పాల్గొనడం, ఎక్కడ చూసినా కలిసి కనిపించడంతో ప్రేమ వార్తలు నిజమే అని ఫిక్స్ అయ్యారు. త్వరలో పెళ్లి అని ఊహాగానాలు మొదలయ్యాయి.
అయితే పెళ్లి పక్కన పెట్టి సహజీవనం షురూ చేసినట్లు విశ్వసనీయ సమాచారం అందుతుంది. ఇటీవల రచ్చ రవి కొత్త కారు కొన్నారు. ఆ కారును ఫ్రెండ్ రాకేష్ కి చూపించడానికి నేరుగా అతడి నివాసానికి వెళ్ళాడు. అక్కడ రాకేష్ తో పాటు సుజాత కూడా ఉన్నారు. రచ్చ రవితో కారు పక్కన నిల్చొని రాకేష్, సుజాత ఫోటోలు దిగారు. దీంతో రాకేష్-సుజాత ఒకే ఇంట్లో ఉన్నట్లు స్పష్టత వచ్చింది. నచ్చిన అమ్మాయితో జీవించడంలో తప్పు లేదు. అయితే చక్కగా పెళ్లి చేసుకోవచ్చు కదా అంటున్నారందరూ.

జోర్దార్ కార్యక్రమంతో పాపులారిటీ తెచ్చుకున్న సుజాత బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్నారు. ఆ షోలో హోస్ట్ నాగార్జునను సుజాత ఏకంగా బిట్టు అని ముద్దుగా పిలిచేది. ఎక్కువ వారాలు ఉన్నకున్నా కొంత ఫేమ్ అయితే బిగ్ బాస్ షోతో సుజాతకు వచ్చింది. జబర్దస్త్ లోకి వచ్చాక రాకేష్ తో బంధం మొదలైంది. ఇక రాకింగ్ రాకేష్ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. టీం మెంబర్ గా ఎంట్రీ ఇచ్చిన రాకేష్ తన టాలెంట్ తో లీడర్ అయ్యాడు. చిన్న పిల్లలతో కామెడీ పంచడం రాకేష్ ప్రత్యేకత.