Robin Hood OTT: హీరో నితిన్ లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్. సమ్మర్ కానుకగా మార్చి 28న విడుదల చేశారు. రాబిన్ హుడ్ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకుడు. గతంలో ఆయన తెరకెక్కించిన ఛలో, భీష్మ సూపర్ హిట్స్. భీష్మలో నితిన్ హీరోగా నటించారు. నితిన్-రష్మిక మందాన జంటగా నటించిన భీష్మ ప్రేక్షకులను మెప్పించింది. భీష్మ మూవీ చూసిన చిరంజీవి దర్శకుడు వెంకీ కుడుములను మెచ్చుకున్నాడు. ఆయనకు సినిమా ఆఫర్ కూడా ఇస్తా అన్నాడు. చిరంజీవితో వెంకీ కుడుముల చేయాల్సిన ప్రాజెక్ట్ ఆగిపోయింది. దాంతో ఆయన మరలా నితిన్ తో ప్రాజెక్ట్ ఓకే చేయించాడు.
Also Read: సముద్రంలో యెల్లో డ్రెస్ లో మెరిసిపోతున్న శివలీకా..
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో మూవీ అనడంలో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో కూడా రష్మిక మందాన హీరోయిన్ గా నటించాల్సి ఉంది. అనుకుకోని కారణాలతో రష్మిక మందాన ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. దాంతో శ్రీలీలను ఎంచుకున్నారు. శ్రీలీలతో నితిన్ కి ఏది రెండో చిత్రం. రాబిన్ హుడ్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. రొటీన్ స్క్రీన్ ప్లే సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది. యాభై కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కించిన రాబిన్ హుడ్ సగం కూడా రికవరీ చేయడంలో ఫెయిల్ అయ్యింది.
కాగా రాబిన్ హుడ్ మూవీ డిజిటల్ రైట్స్ జీ 5 సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక శాటిలైట్ రైట్స్ కూడా ఆ సంస్థ వద్దే ఉన్నాయట. రాబిన్ హుడ్ విడుదలై నాలుగు వారాలు గడుస్తున్న తరుణంలో డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధం అవుతుంది. మే 10 నుండి రాబిన్ హుడ్ స్ట్రీమ్ కానుందట. అదే రోజున వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జీ తెలుగులో ప్రసారం కానుందట. ఈ మేరకు సమాచారం అందుతుంది. జీ 5 ఇటీవల ఈ పద్దతిని అవలంబిస్తోంది. సాధారణంగా డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చిన చిత్రం కొన్ని వారాలు లేదా నెలలు అనంతరం టెలివిజన్ లో ప్రసారం చేస్తారు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని జీ సంస్థ అటు ఓటీటీలో ఇటు టెలివిజన్ లో ఒకే రోజు అందుబాటులోకి తెచ్చింది.
దొంగగా మారిన ఒక అనాథ కథే ఈ రాబిన్ హుడ్ మూవీ. నితిన్ దొంగ, సెక్యూరిటీ గార్డుగా భిన్నమైన పాత్రల్లో కనిపించాడు. కేతిక శర్మ ఓ ఐటమ్ సాంగ్ చేయగా, అందులోని ఓ స్టెప్ వివాదాస్పదం అయ్యింది.