https://oktelugu.com/

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ నుంచి కాజల్ ఎలిమినేట్ … అతను అన్నిట్లో డ్రామా చేస్తాడంటూ

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు వచ్చేసింది. ఇప్పటివరకు ఇంట్లో ఆరుగురు ఇంటిసభ్యులు ఉన్నారు. నిన్నటి ఎపిసోడ్ తో ఒకరు హౌస్ నుంచి బయటకు రావడంతో ఇప్పుడు హౌస్ లో ఐదుగురు సభ్యులు ఉన్నారు. కాజల్ అవుట్ అవ్వడంతో… ఇప్పుడు హౌస్ లో ఐదుగురు శ్రీరామచంద్ర, మానస్, సిరి, సన్నీ, షన్ను మిగిలారు. ఇక బయటకు వచ్చిన కాజల్ మిగిలిన హౌస్ మేట్స్ పై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. ఈ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 13, 2021 / 10:05 AM IST
    Follow us on

    Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు వచ్చేసింది. ఇప్పటివరకు ఇంట్లో ఆరుగురు ఇంటిసభ్యులు ఉన్నారు. నిన్నటి ఎపిసోడ్ తో ఒకరు హౌస్ నుంచి బయటకు రావడంతో ఇప్పుడు హౌస్ లో ఐదుగురు సభ్యులు ఉన్నారు. కాజల్ అవుట్ అవ్వడంతో… ఇప్పుడు హౌస్ లో ఐదుగురు శ్రీరామచంద్ర, మానస్, సిరి, సన్నీ, షన్ను మిగిలారు. ఇక బయటకు వచ్చిన కాజల్ మిగిలిన హౌస్ మేట్స్ పై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. ఈ తరుణంలో నిన్నటి ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం…

    నిన్నటి ఎపిసోడ్ లో చిట్టీలో వచ్చిన పాటను పాడకుండా, స్టెప్పులు వేయకుండా యాక్ట్ చేసి మాత్రమే చూపించాలి అనే అట ఆడించారు నాగ్. ఇందులో శ్రీరామచంద్ర, కాజల్, షన్ను ఒక టీం. మిగిలిన మానస్, సిరి, సన్నీలను మరో టీంగా విడగొట్టారు. ఈ గేమ్స్ సాగుతున్న క్ర‌మంలోనే సిరిని మూడో ఫైనలిస్టుగా, షణ్నును నాలుగో ఫైనలిస్టుగా , మాన‌స్‌ని ఐదో ఫైన‌లిస్ట్‌గా ప్ర‌క‌టించి కాజ‌ల్ ఎలిమినేట్ అయిన‌ట్టు తెలియ‌జేశారు. ఆ తర్వాత అయితే బిగ్ బాస్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన కొంద‌రు కంటెస్టెంట్స్ హౌజ్‌మేట్స్‌కి ప‌లు ప్ర‌శ్న‌లు వేశారు. జెస్సీ మాట్లాడుతూ… షణ్నుకి, సిరికి ఎలాంటి బాండింగ్‌ ఉందో నాకు తెలుసు. కానీ జనాలు ఏమనుకుంటున్నారు ? అని ఎప్పుడైనా ఆలోచించావా ? అని అడిగాడు. దానికి ష‌ణ్ముఖ్‌.. ఫ్యామిలీస్‌ ఇంట్లోకి వచ్చినప్పటినుంచి నాకూ ఈ ప్రశ్న ఎదురైంది. అది తప్పే, కానీ సిరి నా బెస్ట్‌ఫ్రెండ్‌.. జీవితాంతం ఆమెకు సపోర్ట్‌గా ఉంటాను అని అన్నాడు.

    ఇక కాజల్ ఎలిమినేట్ అయినందుకు స‌న్నీ, మాన‌స్ చాలా ఫీల్ అయ్యారు. కాజ‌ల్ స్టేజ్ పైకి వ‌చ్చాక సన్నీ ఐదు రెట్ల ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తే మానస్‌ ఐదు రెట్ల ఫ్రెండ్‌షిప్‌ చేస్తాడంది కాజల్. సిరి ఐదు రెట్ల ఎమోషన్‌ ఇస్తే, శ్రీరామ్‌ ఐదు రెట్ల యాక్షన్‌ చేస్తాడని తెలిపింది. షణ్ముఖ్‌ ఐదు రెట్లు డ్రామా చేస్తాడని పేర్కొంది. సిరిని కంట్రోల్‌ చేయడం, తిట్టడం, హగ్గులివ్వడం.. ఇలా ప్రతిదాంట్లో డ్రామా ఉంటుందని అభిప్రాయపడింది.